మాజీ సీఎం మనవడితో కాజల్ కమిట్.. మెగాస్టార్ సినిమా నుంచి తప్పుకుందా.?
రీఎంట్రీలో ఫుల్ జోష్‌లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. కమ్‌బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' సూపర్ హిట్ అవడంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'సైరా: నరసింహారెడ్డి' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఇది ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీని తర్వాత కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్‌కు భారీ ఎదురుదెబ్బ తగలిందనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ నుంచి మరొకరు వెళ్లిపోవడం వల్లే ఈ పరిస్థితి తెలెత్తిందంటున్నారు. ఆ వివరాలు మీకోసం.!

మరో సందేశాత్మక చిత్రంలో మెగాస్టార్
‘సైరా: నరసింహారెడ్డి' తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య'. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని రామ్ చరణ్, మ్యాట్నీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘ఖైదీ నెంబర్ 150'లో రైతు సమస్యలపై పోరాటం చేసిన చిరంజీవి... ఈ మూవీలో దేవాదాయ భూముల ఆక్రమణల గురించి సందేశం ఇవ్వబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

చిరుపై రామ్ చరణ్ ప్రభావం పడింది
ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 30 నిమిషాల పాటు ఉండే ఈ క్యారెక్టర్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో వస్తుందని అంటున్నారు. ఇందులో చెర్రీ.. నక్సలైట్‌గా కనిపించబోతున్నాడట. ఓ మిషన్ పూర్తి చేసే క్రమంలో అతడు మరణిస్తే.. మిగిలిన దాని బాధ్యతను చిరంజీవి తీసుకుంటాడనే టాక్ వినిపిస్తోంది.

ఆమె తప్పుకుంటే.. ఈమె ఒప్పుకోలేదు
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను తీసుకున్నామని చిత్ర యూనిట్ మొదట్లోనే ప్రకటించింది. అయితే, ఆమె అర్థాంతరంగా ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత చిత్ర యూనిట్ అనుష్క శెట్టితో మంతనాలు జరపగా.. ఆమె ఈ మూవీలో చేసేందుకు నిరాకరించిందని ప్రచారం జరిగింది. చివరిగా ఈ సినిమాకు కాజల్ అగర్వాల్ ఓకే చెప్పేసింది.

చిరంజీవి సినిమా నుంచి మరొకరు ఔట్.?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య'లో తాను భాగం కాబోతున్నట్లు కాజల్ అగర్వాల్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. చిరు కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150'లో వీళ్లిద్దరి జంట బాగుండడంతో.. ఇందులో కూడా మెప్పిస్తారని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆచార్య' నుంచి కాజల్ తప్పుకుందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

సినిమా నుంచి తప్పుకోడానికి కారణమిదే
కరోనా ప్రభావం లేకపోతే ‘ఆచార్య'లో నటించి, మిగిలిన వాటి సంగతి చూడాలని కాజల్ భావించిందట. కానీ, ఇప్పుడు పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో ఈ మూవీ నుంచి తప్పుకుందని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ సినిమాలో నటించేందుకు ఆమె అడ్వాన్స్ తీసుకోవడం వల్లే డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.
Recommended Video

ఒకేసారి ముగ్గురిని లైన్‌లో పెట్టేశాడు
లాక్‌డౌన్ ప్రభావంతో ఖాళీగా ఉంటోన్న మెగాస్టార్ చిరంజీవి.. ఇటీవల ఓ న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి క్లారిటీ ఇచ్చాడు. ‘కొరటాలతో సినిమా అయిపోయిన తర్వాత సుజిత్‌తో లూసీఫర్ రీమేక్ చేస్తాను. ఆ తర్వాత బాబీ డైరెక్షన్‌లోనూ మూవీ ఉంటుంది. వీళ్లతో పాటు మెహర్ రమేశ్ కూడా ఓ కథ చెప్పాడు' అని వివరించాడు.


Click it and Unblock the Notifications











