Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
తేజకు షాకిచ్చిన కాజల్.. ఆ విషయంలో తగ్గేదిలేదంటూ ఝలక్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో గత పదేళ్లుగా కాజోల్కు ఎదురేలేకుండా పోయింది. వయసు పెరుగుతున్నా కుర్ర హీరోయిన్ల నుంచి ఎదురవుతున్న పోటీని సునాయసంగా ఎదుర్కొంటు భారీ ప్రాజెక్టులను సొంతం చేసుకొంటున్నది. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసి తేజతో నాలుగోసారి పనిచేయాలన్న ప్రయత్నాలకు గండిపడింది. తేజ దర్శకత్వం వహిస్తున్న సినిమా నుంచి తప్పుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ఏం జరిగిందంటే..
భారీ ప్రాజెక్టులతో కాజల్
సీనియర్ నటిగా దక్షిణాదిలో దూసుకెళ్తున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం 50 సినిమాలకుపైగా నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. క్వీన్ రీమేక్ పారిస్ పారిస్, మోసగాళ్లు, ఆచార్య, ముంబై సాగా, హే సినామిక, ఇండియన్ 2 చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఇలా అగ్రతారగా కొనసాగుతున్న కాజల్‌కు మళ్లీ తేజతో కలిసి నటించే అవకాశం వచ్చింది
తేజ అంటే నాకు గౌరవం
కాజల్ విషయానికి వస్తే.. తేజ అంటే గురువు అనే గౌరవభావం ఉంది. ఏ ఇంటర్వ్యూలోనైనా తేజ ప్రస్తావన వస్తే.. ఆయన ప్రాజెక్టులో మారు మాట్లాడకుండా నటిస్తానని చెబుతుంటారు. అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనైనా తేజ సార్‌ను కాదనను అని కాజల్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం రెమ్యునరేషన్ విషయంలో తేడాలు రావడంతో తేజ ప్రాజెక్టు నుంచి ఆమె బయటకు వెళ్లినట్టు సమాచారం.
నిర్మాతలతో విభేదాలు
ప్రస్తుతం గోపిచంద్‌తో తేజ అలివేలు వెంకటరమణ అనే చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు ప్రారంభించారు. గోపిచంద్‌తో కాజల్ జతకట్టడం ఇదే మొదటిసారి. అయితే లాక్డౌన్ తర్వాత తారల రెమ్యునరేషన్ల కోత పెడుతుండటం తెలిసిందే. అయితే లాక్ డౌన్ తర్వాత పారితోషికానికి తేడా రావడంతో నిర్మాత, కాజల్‌కు విభేదాలు తలెత్తాయనే తాజా సమాచారం.
Recommended Video
రెమ్యునరేషన్ తగ్గించుకోను
అయితే తన రెమ్యునరేషన్ విషయంలో తగ్గేది లేదని, ముందుగా అనుకొన్న ప్రకారం ఇవ్వాల్సిందేనని కాజల్ ఖరాఖండిగా చెప్పారట. దాంతో ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే నిర్మాతలు కూడా తమ వాదన కరెక్టేనని, లాక్డౌన్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కాబట్టి ఆమె పారితోషికం తగ్గించుకొనే దానిని బట్టి ఈ ప్రాజెక్టులో ఆమె ఉంటుందా? లేదా మరొకరిని తీసుకోవాలా? అని అధికారపడి ఉంటుందని యూనిట్ మీడియాతో అభిప్రాయపడ్డారు.