కల్కి సంచలన విజయం.. జగదేక వీరుడు సీక్వెల్ రెడీ.. మెగాస్టార్ తొలి సీక్వెల్ ఎప్పుడు మొదలో తెలుసా?

ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాలు వెలికి తీస్తే అందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒక ఐకానిక్ అండ్ గేమ్ ఛేంజింగ్ సినిమా "జగదేక వీరుడు అతిలోక సుందరి" కూడా తప్పకుండా ఉంటుంది. జెనరేషన్స్ వారీగా టాలీవుడ్ లో అప్పుడప్పుడే కొన్ని వినూత్న సినిమాలు వస్తున్న తరుణంలో ఒక ప్రయోగాత్మక చిత్రంగా అప్పట్లోనే భారీ బడ్జెట్ తో కె రాఘవేంద్ర రావు సృష్టించిన అద్భుత సృష్టే ఈ "జగదేక వీరుడు అతిలోక సుందరి".

ఒక యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ లో ఫాంటసీ జానర్ సినిమాల్లో ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసుకొని అదరగొట్టింది. మరి అప్పట్లో నిర్మాత అశ్విని దత్ కి కాసుల వర్షం కురిపించిన ఈ ప్రయోగాత్మ చిత్రంలో మెగాస్టార్ ప్రెజెన్స్ కానీ తన ఛరిష్మాకి సరైన కంటెంట్ పడితే ఎలా ఉంటుందో ఈ సినిమా ప్రూవ్ చేసింది. కాగా ఈ సినిమా వచ్చిన తర్వాత దీనికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలు మాటలు టాలీవుడ్ లో చాలానే వచ్చాయి.

Is Kalki 2898 AD Sensational hit line clears to chiranjeevi s Jagadeka Veerudu Athiloka Sundari sequel

అంతెందుకు తమ బ్యానర్ లో ఎంతో ప్రత్యేకమైన ఈ సినిమాకి సీక్వెల్ చేస్తామని అశ్విని దత్ కూడా చాలా సందర్భాల్లో అన్నారు. కాగా లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో అసలు సీక్వెల్ ఉందా లేదా అనే మాటపై కుండ బద్దలు కొట్టేసారు. జగదేక వీరుడు అతిలోక సుందరి కి తప్పకుండా సీక్వెల్ చేస్తానని కాకపోతే ఇప్పుడు అంతా కల్కి సంబంధిత పనుల్లోనే ఉన్నాం కాబట్టి ఇవి ఫినిష్ అయ్యిన వెంటనే ఆ సీక్వెల్ ఉంటుంది అని అశ్విని దత్ క్రేజీ అప్డేట్ రివీల్ చేశారు.

సో ఇప్పుడే కాకపోయినా డెఫినెట్ గా రానున్న కొన్నేళ్లలో ఈ అవైటెడ్ అండ్ ఐకానిక్ సినిమా సీక్వెల్ ఉంటుంది అని చెప్పొచ్చు. కాగా ఇది డెఫినెట్ గా చిరుతో ఉండకపోవచ్చు అని అందరికీ తెలుసు అందుకే చిరు వారసుడు గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ తో చేయాలని ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో డిమాండ్ చేస్తున్నారు. అలాగే హీరోయిన్ గా ఆ సినిమాలో శ్రీదేవి చేశారు కాబట్టి ఆమె కూతురు ఇప్పుడు హీరోయిన్ జాన్వీ కపూర్ ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

Is Kalki 2898 AD Sensational hit line clears to chiranjeevi s Jagadeka Veerudu Athiloka Sundari sequel

మరి పస్తుతానికి క్యాస్టింగ్ సస్పెన్స్ గానే ఉంది కానీ సినిమా మాత్రం వెరీ మచ్ ఆన్ లోనే ఉందని కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇపుడు అయితే అశ్విని దత్ మరియు తమ వైజయంతి మూవీస్ బ్యానర్ వారు ప్రభాస్ తో చేసిన "కల్కి 2898 ఎడి" మేనియాని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏఈ చిత్రం 800 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తుండగా రానున్న రోజుల్లో మరికొన్ని చిత్రాలు అయితే ఈ ఫ్రాంచైజ్ నుంచి రానున్నాయి. అలాగే ఈ చిత్రాన్ని యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Read more about: chiranjeevi vishwambhara sri devi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X