నయనతార అవుట్.. టాలీవుడ్ టాప్ హీరోతో కరీనా కపూర్ స్పెషల్ సాంగ్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీయూ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ది రాజాసాబ్. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ తదితరులు నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం డిజైన్ చేసిన ఓ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ పెర్ఫార్మ్ చేస్తున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
రాజాసాబ్ సినిమా టీజర్‌ను ఇటీవల హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ టీజర్‌కు అన్ని భాషల్లోను రికార్డు స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా కోసం కార్తీక్ పళని సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గతంలో రూపొందించిన పాటలన్నింటినీ పక్కన పడేసి.. కొత్తగా కొన్ని పాటలు కూడా తమన్ అందించారనే వార్త కూడా వైరల్ అయింది. ఈ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్‌ను కూడా ఇటీవల రికార్డు చేసినట్టు తెలిసింది.

అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ నుంచి సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వాహబ్, జిషు సేన్ గుప్తా తదితరులు నటిస్తున్నారు. వీరితోపాటు ఈ చిత్రంలో కరీనా కపూర్ ఖాన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఐటమ్ సాంగ్‌ను మించిన పాట కోసం కరీనా కపూర్‌ను రంగంలోకి దించారు. త్వరలోనే ఆ పాటను హైదరాబాద్‌లో షూట్ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను డిజైన్ చేస్తున్నట్టు మీడియాలో ఓ వార్త ప్రచారం జరుగుతున్నది.
సుమారుగా 450 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం తొలుత సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతారను ముందుగా అప్రోచ్ అయ్యారు. అయితే తను స్పెషల్ సాంగ్‌లో నటించడానికి నిరాకరించడంతో పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్‌గా రాణిస్తున్న కరీనా కపూర్‌ను అప్రోచ్ అయ్యారు. ఆమె అందుకు సుముఖంగా ఉండటంతో ఆమెను ఓకే చేశారు. దాంతో కరీనా కపూర్ సౌత్ ఎంట్రీకి రెడీ అవుతున్నది.
ఇండియాలో బిగ్గెస్ట్ హారర్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, సుప్రిత్ రెడ్డి, సప్తగిరి, యోగిబాబు, వీటీవీ గణేష్, బ్రహ్మనందం, వెన్నెల కిషోర్, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా గురించిన లేటేస్ట్ అప్‌డేట్స్ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











