ప్రభాస్‌తో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. స్పిరిట్‌‌ మూవీతో భారీ రీ ఎంట్రీ!

ఒకో తరానికి ఒకో సూపర్ స్టార్ ఎరా ఇండియన్ సినిమా దగ్గర నడుస్తుంది. చాలా సాదా సీదా సినిమాలు నుంచి ఒక్కసారిగా ఇండియన్ సినిమా దగ్గర మారు మోగే రేంజ్ లో సినిమాల్లో స్టార్స్ మారిన హీరోలు కొందరు కనిపిస్తారు. అలా ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పొచ్చు.

కాగా ప్రభాస్ ఎరా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో నడుస్తుంది. తనది ప్లాప్ సినిమా అయినా కూడా మినిమం 400 కోట్ల వసూళ్లు వస్తున్నాయి. ఇక హిట్ టాక్ వస్తే మినిమం 800 కోట్ల నుంచి 1000 కోట్లు పక్కా లెక్కగా ప్రభాస్ మార్కెట్ మారిపోయింది. కాగా ప్రభాస్ ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి రావడంతో తన సినిమా లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Is kareena Kapoor to pair with Prabhas in Sandeep Reddy Vanga s Sprit

కాగా ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో సెన్సేషనల్ హైప్ లో ఉన్న సినిమా "స్పిరిట్" కూడా ఒకటి. మరి దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో రెండేళ్ల కితమే అనౌన్స్ చేసిన ఈ సినిమా పాన్ ఆసియ లెవెల్లో అనౌన్స్ అయ్యింది. అయితే ఈ సినిమా విషయంలో ఈ మధ్యకాలంలో పలు క్రేజీ వార్తలే వైరల్ గా మారాయి. మరి వీటిలో బాలీవుడ్ సీనియర్ హాట్ నటి కరీనా కపూర్ నటిస్తుంది అని ముందు పలు వార్తలు వచ్చాయి.

అయితే ఇది ప్రభాస్ సరసనా లేక వేరే పాత్రా అనే టైం లో ఈమెతో పాటుగా ఈమె భర్త బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా ఉన్నాడు అని ఇద్దరూ నెగిటివ్ రోల్స్ లో కనిపిస్తారు అని మరిన్ని రూమర్స్ వచ్చాయి. అయితే ఫైనల్ గా వీటిలో సగం అయితే ఇప్పుడు క్లారిటీ అయ్యిపోయాయి. ఈ భారీ ప్రాజెక్ట్ లో తను లేను అని ఆమె తేల్చేసింది.

Is kareena Kapoor to pair with Prabhas in Sandeep Reddy Vanga s Sprit

బాలీవుడ్ లో రీసెంట్ గా జరిగిన ఓ ఇంట్రాక్షన్ లో ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ తమ కిల్లింగ్ వర్క్ తో ఎంతో బిజీగా ఉన్నారు కానీ నేను మాత్రం ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల స్పిరిట్ లో లేను అని ఆమె చెప్పేసింది. దీనితో దేవర విలన్ భైర భార్య ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో లేనట్టే అని చెప్పాలి. మరి సైఫ్ కూడా ఉన్నాడో లేదో అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ లో కొరియన్ నటుడు డాన్ లీ కూడా ఉన్నాడు అని పలు రూమర్స్ ఉన్నాయి. సినిమా నేపథ్యంలో భాగంగానే డాన్ లీ ఉండొచ్చు అనే టాక్ పెద్ద ఎత్తున వినిపిస్తూ వచ్చింది. సినిమాలో ప్రభాస్ తో పాటు ఎవరు ఉన్నా లేకపోయినా కూడా కొరియన్ బాలయ్య మాత్రం ఉండాలి అని రెబల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి చూడాలి ఈ బిగ్గెస్ట్ కాంబినేషన్ విషయంలో ఏమవుతుంది అనేది.

More from Filmibeat

Read more about: prabhas spirt sandeep reddy vanga
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X