చిరంజీవితో అలనాటి స్టార్ హీరోయిన్ రాధిక కూతురా...!?
నాగచైతన్య సరసన హీరోయిన్ గా 'జోష్" సినిమాలో నటించిన కార్తీక గుర్తుండే ఉంటుంది. నిన్నటితరం హీరోయిన్ రాధ కుమార్తె కార్తీక..తొలి చిత్రం తర్వాత మళ్ళీ తెలుగులో నటించకపోయినా, ప్రస్తుతం తమిళంలో బాగానే హడావిడి చేస్తోంది. తన కుమార్తె హీరోయిన్ గా నటించిన ఓ తమిళ సినిమా విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఆ సినిమా హిట్టవ్వాలని ఏడుకొండలవాడికి అప్లికేషన్ పెట్టుకుంది రాధ.
ఈ సందర్భంగా తిరుపతిలో రాధ మాట్లాడుతూ, తెలుగులోనూ కార్తీకకి అవకాశాలొస్తున్నాయనీ, ఛాన్సిస్తే చిరంజీవి సరసన నటించడానికి కార్తీక రెడీ..అని ప్రకటించేసింది..చిరంజీవి 150వ సినిమాలో నటించేందుకు సన్నధ్దమవుతున్న తరుణంలో, రాధ ఇచ్చిన స్టేట్ మెంట్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి. రాధతో డాన్సుల్సి చాలా సినిమాల్లో ఇరగధీసిన చిరంజీవి, ఆమె కుమార్తెతో చిందు లేయనున్నారో లేదోగానీ, రాధ మాత్రం, చిరుతో తాను చాలా హిట్ సినిమాల్లో నటించాననీ, ఆ అదృష్టం తన కుమార్తెకూ దక్కాలని ఆశపడ్తోందన్నది సుస్పష్టమైపోయింది.


Click it and Unblock the Notifications











