ప్రభాస్ కోసం ఆ ఇద్దరు హాట్ హీరోయిన్లు.. స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి బంపర్ ప్లాన్!
ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ సెలెబ్రెటీ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పి తీరాలి. కాగా ప్రభాస్ హీరోగా నటించిన ప్రతి సినిమా టాక్ తో సంబంధం లేకుండా వందల కోట్లు రాబడుతున్నాయి. ఒకవేళ హిట్ అయితే ఆ వంద కాస్తా 1000 కోట్ల వరకు కూడా పరిగెడుతుంది.
అందుకే ఇప్పుడు ప్రభాస్ ఇండియా లోనే మోస్ట్ పవర్ ఫుల్ హీరోగా నిలిచాడు. కాగా ఇప్పుడు ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898 ఎడి బాక్సాఫీస్ దగ్గర వండర్స్ చేస్తుంది. మరి దీనికే ఇలా ఉంటే నెక్స్ట్ క్రేజీ దర్శకుడు ది మ్యాడ్ మ్యాన్ సందీప్ రెడ్డి వంగ తో పాన్ ఆసియ ప్రాజెక్ట్ ఉంది. ఆ సినిమానే "స్పిరిట్". సందీప్ ఆల్రెడీ ఆనిమల్ సినిమాతో 900 కోట్ల మార్క్ కొట్టి చూపించాడు.

మరి ఇలాంటి మార్కెట్ లేని దర్శకులతో ప్రభాస్ 1000 కోట్లు కొడుతున్న వాడు. అలాంటిది ఈ క్రేజీ కలయికలో సినిమా పడితే ఎలా ఉంటుందో ఊహలకి కూడా అందదు. అందుకే ఆ సినిమా బుకింగ్స్ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ పై ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకుండానే ఇప్పుడు నుంచే అంచనాలు వేస్తున్నారు.
కాగా ఇప్పుడు ఈ భారీ చిత్రంపై మరిన్ని క్రేజీ రూమర్స్ వైరల్ అవుతుండగా ఓ దక్షిణ కొరియా నటుడు కూడా నటిస్తున్నాడని సోషల్ మీడియా షేక్ అవుతుంది. అయితే దీనితో పాటుగా మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వైరల్ గా మారింది. కాగా ఈ సినిమాలో అయితే బాలీవుడ్ టాప్ బ్యూటీస్ ఇద్దరు ఐశ్వర్య రాయి ఇంకా కత్రినా కైఫ్ లు హీరోయిన్స్ గా కనిపిస్తారని వినిపిస్తుంది.

దీనితో ఈ ఇద్దరు బిగ్ స్టార్స్ తో ప్రభాస్ రొమాన్స్ చేయనున్నాడని చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని సందీప్ ఒక పోలీస్ డ్రామాగా ప్లాన్ చేస్తుండగా సినిమా ఆసియన్ కంట్రీస్ నేపథ్యంలో తెరకెక్కనుంది అని టాక్ ఉంది. అందుకే అనౌన్స్ చేసినప్పుడే చైనీస్, జాపనీస్, కొరియన్ భాషల్లో కూడా అని చెప్పేసారు. మరి సందీప్ ఏం కుక్ చేస్తున్నాడో అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











