Pregnancy ప్రెగ్నెంట్‌గా కత్రినా కైఫ్.. తల్లి కాబోతున్నదంటూ లీకైన సీక్రెట్

సెలబ్రిటీల సినిమాలపై ఎంత క్యూరియాసిటీ ఉంటుందో వాళ్ళ పర్సనల్ లైఫ్ పై అంతకుమించి ఉంటుంది. అందుకే తరచుగా తమ అభిమాన నటీనటులు ఎవరితో డేటింగ్ చేస్తున్నారు? ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు? వంటి వాళ్ళ పర్సనల్ విషయాలను గమనిస్తూ ఉంటారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ తల్లి కాబోతుందనే వార్త వైరల్ అవుతుంది. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆమె తల్లి కాబోతుందనే విషయం ఎలా లీక్ అయ్యింది అనే విషయంపై మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.

ఇటీవల కాలంలో సీనియర్ల నుంచి యంగ్ హీరోయిన్లు అంతా పెళ్లి బాట పట్టడం, ఆ తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మూవీ లవర్స్ కూడా సెలబ్రిటీలను ఓ కంట కనిపెడుతూ వస్తున్నారు. కానీ కొంతమంది సెలబ్రిటీలు పర్సనల్ లైఫ్ ను, ప్రొఫెషనల్ లైఫ్ ను విడివిడిగా చూస్తారు.

Is Katrina Kaif pregnant Here is fact which news hits media headlines

అందుకే తమ పర్సనల్ లైఫ్ గురించి అందరి ముందు బయట పెట్టడానికి ఇష్టపడరు. అందులో భాగంగానే తమ రిలేషన్షిప్, పెళ్లి, ప్రెగ్నెన్సీ వంటి విషయాలు బయట పడకుండా జాగ్రత్త పడతారు. కానీ ఎప్పుడూ వీళ్ళ వైపే ఫోకస్ చేసి ఉండే కెమెరాల కళ్ళు మాత్రం అలాంటి విషయాలను ఇట్టే పట్టేస్తాయి.

ఇక త్వరలోనే తల్లి కాబోతున్న దీపికా పదుకొనే కూడా అసలు విషయాన్ని చెప్పడానికి చాలా రోజులే తీసుకుంది. అలాగే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట కూడా బిడ్డ పుట్టే దాకా ఆ విషయాన్ని అస్సలు బయట పెట్టలేదు. ఎన్ని రూమర్లు వచ్చినా స్పందించకుండా అనుష్క శర్మ రెండవ బిడ్డకు తల్లి కాబోతోంది అన్న ఆ విషయాన్ని రహస్యంగా దాచారు.

ఏదైతేనేం ఎట్టకేలకు వీళ్ళిద్దరి ప్రెగ్నెన్సీ విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తల్లి కాబోతోందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు కత్రినా కైఫ్ అని సమాచారం.

Is Katrina Kaif pregnant Here is fact which news hits media headlines

యంగ్ హీరో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ 2021 డిసెంబర్లో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అందుకే కత్రినా ఎప్పుడు లూజ్ డ్రెస్ వేసుకుని కన్పించినా ఆమె ప్రెగ్నెంట్ అంటూ హల్చల్ చేస్తున్నారు.

తాజాగా ఓ స్టార్ సెలబ్రిటీ ఇచ్చిన పార్టీకి ఆమె హాజరు కాకపోవడం మరోసారి కత్రినా ప్రెగ్నెన్సీ రూమర్లకు తెర తీసినట్టుగా అయింది. బేబీ బంప్ బయట పడుతుందనే ఉద్దేశంతోనే ఆమె పార్టీకి రాలేదని పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో కత్రినానే క్లారిటీ ఇవ్వాలి.

కాగా కత్రినా కైఫ్ గత సంవత్సరం టైగర్ 3 మూవీలో కన్పించింది. 2024లో విజయ్ సేతుపతితో కలిసి మెర్రీ క్రిస్మస్ చిత్రంలో నటించింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఆమె నెక్స్ట్ సినిమా గురించి ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. పైగా కత్రినా బయట ఎక్కడా కన్పించడం లేదు. ఇది కూడా ఆమెపై ప్రెగ్నెంట్ రూమర్లు రావడానికి ఓ కారణం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X