2 రోజుల పెళ్లితో కీర్తి సురేష్ .. ఎగ్జాక్ట్ ఏయే తేదీలలో అంటే..

ప్రెజెంట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ కూడా ఒకరని అందరికీ తెలిసిందే. కాగా కీర్తి సురేష్ ఇపుడు కెరీర్ పరంగా కొంచెం స్లో అయ్యింది కానీ రీసెంట్ గానే ఒక షాకింగ్ ట్విస్ట్ కూడా ఇచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ లో తన హిందీ సినిమా విడుదలకి రెడీ అవుతుండగా.. ఆమెను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు అనుకుంటున్నారు. కానీ సడెన్ గా దానిని ఓవర్ టేక్ చేస్తూ తన పెళ్లి వార్తలు ఊహించని విధంగా తెరపైకి వస్తున్నాయి. గత కొన్ని నెలల కితమే తన రిలేషన్ షిప్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కీర్తి తన చిన్ననాటి స్నేహితుణ్ని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వచ్చిన వార్తలని కూడా తోసి పుచ్చింది.

is keerthy suresh wedding will be happen in this 2 dates

కానీ ఫైనల్ గా ఆ పుకార్లే నిజం కాబోతున్నాయి అన్నట్టుగా ఈసారి ఏకంగా ఆమె పెళ్లి కూడా నిశ్చయం అయ్యిపోయింది అంటూ వార్తలు బయటకి వచ్చాయి. కాగా కీర్తి సురేష్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్టుగా ఇపుడు సినీ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తుంది. అలాగే అది కూడా గోవాలో చాలా గ్రాండ్ గా లేదా సింపుల్ గానే వీరి వివాహం చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా టాక్ ఉంది.

ఐతే ఇపుడు లేటెస్ట్ గా ఈ పెళ్లి కేవలం ఒక్కరోజు కాదు రెండు రోజులు జరగోబోతోంది అంటూ రెండు డేట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి వీటి ప్రకారం డిసెంబర్ నెలలో 11 మరియు 12 వ తేదీలలో అయితే కీర్తి సురేష్ పెళ్లి వేడుకలు గోవాలో జరగనున్నాయట. ఒకరోజు పెళ్లి .. ఆ పెళ్లికి కొనసాగింపుగా రిసెప్షన్ ని గోవాలోనే వారు ప్లాన్ చేసుకున్నట్టుగా ఇపుడు బలమైన వార్తలు వినిపిస్తున్నాయి.

is keerthy suresh wedding will be happen in this 2 dates

కాగా ఆ తేదీలకి ఇంకా ఎక్కువ సమయం కూడా లేని నేపథ్యంలో ఇంకా ఎంగేజ్మెంట్ లాంటి వార్తలు కూడా రాకుండానే డైరెక్ట్ పెళ్లి తేదీలే బయటకి వచ్చేయడం ఒకింత ఆశ్చర్యకరంగానే ఉందని చెప్పాలి. అలాగే ఈ రెండు రోజులు నుంచి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ కీర్తి సురేష్ నుంచి కానీ తన కాంపౌండ్ నుంచి కానీ ఎలాంటి కదలిక లేకపోవడంతో ఈ వార్తలు దాదాపు నిజమేనా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

మరి చూడాలి కీర్తి సురేష్ నుంచి అఫీషియల్ గా ఎపుడు క్లారిటీ వస్తుంది అనేది. ఇక ఈ పెళ్లి వార్తలు పక్కన పెడితే కీర్తి సురేష్ తెలుగులో రివాల్వర్ రీటా అనే సినిమాతో రానుంది. అలాగే తమిళ్ లో రీసెంట్ గా చేసిన రఘు తాత ప్లాప్ కాగా అన్ని ఆశలు ఇక తన హిందీ ఎంట్రీ సినిమా "బేబీ జాన్" పైనే పెట్టుకుంది. కాగా ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా హిందీలో విడుదల కాబోతుండగా ఇవి మినహా తెలుగులో యువ హీరో సుహాస్ తో ఓ వెబ్ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ వీడియోకి చేసింది మహానటి.

More from Filmibeat

Read more about: keerthy suresh baby john
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X