బిగ్ ఆఫర్ పట్టేసిన "కేజీఎఫ్" బ్యూటీ? ఆ క్రేజీ సీక్వెల్లో ఛాన్స్?
భారతదేశంలోని ఏ చిత్ర పరిశ్రమలో చూసుకున్నా హీరోయిన్స్ విషయంలో పరిస్థితులు ఒకింత ఇంట్రెస్ట్ గానే ఉంటాయని చెప్పొచ్చు. అప్పటి వరకు ఎన్ని సినిమాలు ఎన్ని పాత్రలు చేసినప్పటికీ ఒక్క సినిమా చాలు ఆ హీరోయిన్ ని ఓవర్ నైట్ లో స్టార్ ని చేసి పెడుతుంది. ఇలా ఇటీవల కాలంలో కొందరు హీరోయిన్స్ మాత్రమే కెరీర్ పరంగా మంచి హైట్స్ చూడగలిగారని చెప్పాలి.
కాగా గత ఏడాది వచ్చిన యానిమల్ సినిమాలో మెయిన్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మికా మందన్నా. అయినప్పటికీ ఆ సినిమాలో సెకండాఫ్ లో వచ్చిన సెకండ్ హీరోయిన్ తృప్తి దిమ్రి ఒక్కసారిగా నేషనల్ లెవెల్లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే తన కంటే ముందు ఓ రేంజ్ లో స్టార్డం ని సొంతం చేసుకున్న హీరోయిన్ మాత్రం సౌత్ కు చెందిన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి అని చెప్పొచ్చు.

పాన్ ఇండియా హిట్ చిత్రం కేజీఎఫ్ 1 లో నటించిన ఈమె అందరి దృష్టిని మొదట బాగా ఆకర్షించింది. కానీ పార్ట్ 2తో మాత్రం ఒక్కసారిగా శ్రీనిధి శెట్టి ఫాలోవర్స్ ఓ రేంజ్ లో పెరిగిపోయారు. ఇలా అక్కడ నుంచి మంచి క్రేజ్ ని శ్రీనిధి శెట్టి సొంతం చేసుకోగా కేవలం కన్నడ సినిమాలే కాకుండా ఇతర భాషల్లో కూడా గట్టి ఆఫర్లు అందుకుంది.
ఇలా ప్రస్తుతం తెలుగులో కూడా సాలిడ్ సినిమాలు ఈమె చేస్తుండగా ఇవి కాకుండా మరో క్రేజీ ఆఫర్ ని ఈ అమ్మడు పట్టేసినట్టుగా ఫిలింనగర్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో మళ్ళీ కేజీఎఫ్ 2 బ్యూటీ ఓ క్రేజీ సీక్వెల్ లో మెరవనున్నట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ సీక్వెల్ ఏదో కాదు గత ఏడాది తమిళనాట వచ్చి రికార్డులు తిరగరాసిన రజనీకాంత్ చిత్రం "జైలర్" సీక్వెల్ అని వినిపిస్తుంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో చేసిన ఈ చిత్రం 600 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టి తమిళనాట సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత మేకర్స్ పార్ట్ 2 ని కన్ఫర్మ్ చేసేసారు. అపుడు మొదటి పార్ట్ లో మిల్కి బ్యూటీ తమన్నా స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇపుడు మేకర్స్ శ్రీనిధి శెట్టిని పట్టుకొస్తున్నారట.
మరి ఈమె ఈ సినిమాలో దాదాపు ఖాయం అన్నట్టే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే శ్రీనిధి కూడా తమన్నా తరహా పాత్రలో కనిపిస్తుందా? లేక అంతకంటే కీలక పాత్రలోనా అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీనిధి శెట్టి తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన ఆమె నటిస్తుండగా తెలుగులో ఆమె ఎంట్రీ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి తన ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది.


Click it and Unblock the Notifications











