ఆలియా భట్ హీరోతో బీచ్‌లో ఖుషీ కపూర్ షికారు.. బికినీ అందాల కిర్రాక్!

అందాల తార, స్వర్గీయ శ్రీదేవీ కూతురిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఖుషీ కపూర్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్‌గా కనిపిస్తుంటుంది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే.. ఏ టాప్ హీరోయిన్ లభించని క్రేజ్ ఈ భామకు లభించిందంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే తాజాగా తన సోదరి జాన్వీ, ప్రియుడు, నటుడు వేదాంగ్ రైనాతో కలిసి మాల్దీవుల్లో మజా చేస్తున్న విషయం మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

ఖుషీ కపూర్‌ హీరోయిన్‌గా మారక ముందే తన స్నేహితుడు వేదాంగ్ రైనాతో ప్రేమలో పడింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఇటీవల రిలీజై వెబ్ సిరీస్ ది ఆర్చీస్ లో కలిసి జంటగా నటించారు. ఈ సినిమా షూటింగులోనే వారిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని అందరూ చెప్పుకొంటారు. అయితే వారిద్దరూ చాటుమాటుగా ఈ రొమాంటిక్ మూవెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

Is Khushi Kapoor enjoying Vacation with Alia Bhatt s Jigra Hero Vedang Raina

ఇక వేదాంగ్ రైనా ఇటీవల ఆలియా భట్‌తో కలిసి జిగ్రా మూవీలో నటించాడు.ఈ సినిమా పెద్దగా బాక్సాఫీష్ వద్ద ప్రభావం చూపించలేకపోయింది. ఆయనకు కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే నటుడిగా నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు కెరీర్‌పైన దృష్టి పెడుతూనే ఖుషితో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు.

జిగ్రా ప్రమోషన్స్‌తో బిజీగా మారిన వేదాంగ్ రైనా తాజాగా మాల్దీవుల్లో తెలిపోయారు. అయితే వెకేషన్ సందర్భంగా దిగిన ఫోటోలను షేర్ చేయగా.. ఆయన రొమాంటిక్ వ్యవహారం బయటపడింది. ఆ ఫోటోలపై ఘాటుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆయనపై రకరకాలు కామెంట్స్ చేస్తూ కొందరు ట్రోల్ కూడా చేస్తున్నారు.

Is Khushi Kapoor enjoying Vacation with Alia Bhatt s Jigra Hero Vedang Raina

వేదాంగ్ షేర్ చేసిన ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ..ఖుషీ కపూర్ ఫోటోలు బాగా తీస్తుంది కదా.. నీ ఫోటోలను మంచిగా క్లిక్ చేసింది. మీరిద్దరూ కూడా హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు కదా. జాన్వీ కూడా మీతో ఉంది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై వేదాంగ్ మాత్రం కిమ్మనకుండా మౌనంగా ఉండిపోయారు.

అయితే ఖుషి, జాన్వీ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్టు ఫోటోలు స్పష్టం చేశాయి. వేదాంగ్ షేర్ చేసిన ఫోటోలు కూడా మ్యాచ్ కావడంతో వారు అంతా అక్కడే ఉన్నారని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. వీరితోపాటు జాన్వీ ప్రియుడు శిఖర్ కూడా వారితో ఉన్నట్టు రూమర్లు క్రియేట్ అయ్యాయి. దాంతో రెండు జంటలు బాగానే ఎంజాయ్ చేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X