For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అక్రమ సంబందం రట్టైనా పై "కిమ్"మనటం లేదు

  |

  నిన్న కటక్ వన్ డే లో దుమ్ము రేపిన యువరాజ్ సింగ్ వార్తల్లో నిలిస్తే యువీ మాజీ గర్ల్ ఫ్రెండ్ కూడా వారతల్లోనే కనిపించింది. అయితే యువీలా గొప్ప పని చేసి మాత్రం కాదు వేరొకరితో అక్రమ సంబందం ఉందన్న వార్తతో యువరాజ్ మాజీ ప్రేయసి కిమ్ శర్మ అందరినోళ్ళలో నాను తోది. క‌ట‌క్ వ‌న్డేలో సెంచ‌రీతో దుమ్మురేపి యువ‌రాజ్ సింగ్ వార్త‌ల్లో నిలవ‌గా...అత‌డి మాజీ ప్రేయ‌సి మాత్రం ఇల్లీగ‌ల్ క‌నెక్ష‌న్ తో హాట్ టాపిక్ అయింది. ఖ‌డ్గం హీరోయిన్ గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన కిమ్ శ‌ర్మ‌, గ‌తంలో యువీతో స‌హ‌జీవ‌నం చేసింది. ఆ త‌ర్వాత యువీకి గుడ్ బై చెప్పి..ఓ వ్యాపారిని పెళ్లి చేసుకుంది. ఆ త‌ర్వాత యువీ కూడా వేరే గాళ్ ఫ్రెండ్ ను వెతుక్కోవ‌డంతో సీన్ అక్క‌డికి క్లోజ్ అయింది. 'ఖడ్గం' చిత్రంలో నటించిన కిమ్‌ శర్మ బాలీవుడ్‌లో 'మొహబ్బతేన్‌'లాంటి చిత్రాలతో పాపులర్‌ అయింది. కెన్యాకి చెందిన వ్యాపారవేత్త అలీ పుంజానిని పెళ్లి చేసుకుని సినిమా రంగానికి దూరమైన కిమ్‌ శర్మ డిజైనర్‌ అర్జున్‌ ఖన్నాతో ఇల్లీగల్‌ అఫైర్‌ పెట్టుకుందని స్పాట్‌బాయ్‌ న్యూస్‌ బ్రేక్‌ చేసింది.

  భర్త నుంచి ఇంకా అధికారికంగా విడిపోక ముందే అతడిని వదిలేసి వచ్చి ఇక్కడ అర్జున్‌ ఖన్నాతో ఉంటోందని, ఈమధ్య పబ్లిక్‌ వేడుకల్లోను అతడితో చనువుగా వ్యవహరిస్తూ తమ గురించి ప్రపంచం ఏమనుకున్నా ఫర్వాలేదన్నట్టు ప్రవర్తిస్తోందని కిమ్‌ శర్మపై చాలానే అపవాదులు మోపుతున్నప్పటికీ ఆమె మాత్రం ఇదంతా తనకి తెలియనట్టే సైలెంట్‌గా ఉండిపోయింది. పెళ్లికి ముందు చాలా కాలం క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌తో సహ జీవనం చేసిన కిమ్‌ శర్మ అతడికి హ్యాండిచ్చి విదేశీ వ్యాపారవేత్తని కట్టుకుంది. చూస్తుంటే ఆ పెళ్లి కూడా మూణ్ణాళ్ల ముచ్చటే అయినట్టుంది.

  సెల‌బ్రిటీలకు ఇవ‌న్నీ కామ‌నే అనుకున్నా...ఐతే పెళ్లై భ‌ర్త ఉండ‌గా, మ‌రొక‌రితో ఇల్లీగ‌ల్ క‌నెక్ష‌న్ పెట్టుకోవ‌డ‌మేమిట‌ని స్పాట్ బాయ్ వెబ్ సైట్ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. దీనిపై కిమ్ శ‌ర్మ స్పందించ‌లేదు. ఐతే బాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం కిమ్ శ‌ర్మ భ‌ర్త‌కే లేని అభ్యంత‌రం మీడియాకు ఎందుక‌ని సెటైర్లు వేస్తోంది. ఈ విష‌యాన్ని ఆ బ్యూటీ లైట్ తీసుకుని ఉంటుంద‌ని, అందుకే దీనిపై రియాక్ట్ కావ‌డం లేదంటున్నారు. ఈ జాబితాలో ఉన్న సెల‌బ్రిటీలు బ్రేక‌ప్ అనే ఆయుధాన్ని వాడ‌తారు క‌దా...మ‌రి కిమ్ శ‌ర్మ త‌న భ‌ర్త‌తో ఎందుకు బ్రేక‌ప్ కాలేదన్న సందేహాలూ కొంద‌రిలో మెదులుతున్నాయి.

  English summary
  According to a report in SpotboyE, Kim Sharma is cheating on her husband with designer Arjun Khanna, who is married to Shefali. The website reports that Kim Sharma and Arjun Khanna made a red carpet appearance together at the launch of Dabboo Ratnani's 2017 calendar. The two were spotted holding hands and mingling with the guests.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X