హర్షవర్ధన్‌తో కిమ్ శర్మ జోరుగా రొమాన్స్.. శ్రీలంకలో వారం రోజులుగా..
బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో నటించిన నటీ, నటులు కిమ్ శర్మ, నటుడు హర్షవర్ధన్ రాణే డేటింగ్ వ్యవహారం మరోసారి మీడియాలో చర్చనీయాంశమైంది. గత కొద్దికాలంగా వీరి అఫైర్ విషయం మీడియాలో నానుతున్నది. ముంబైలో చాటుమాటుగా కలుస్తూ మీడియా కంట పడిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం హర్షవర్ధన్, కిమ్ శర్మ శ్రీలంకలో రొమాంటిక్ టైమ్‌ను గడుపుతున్నట్టు వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గత వారం రోజులుగా శ్రీలంకలో విహారయాత్ర చేస్తున్నట్టు ఓ బాలీవుడ్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

సినీ కెరీర్ హై రేంజ్‌లో ఉండగానే.. కెన్యా పారిశ్రామిక వేత్త అలీ పుంజానీని వివాహం చేసుకొన్నది. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో దాంపత్య జీవితానికి బ్రేక్ పడింది. ఆ సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేకుండా కెన్యా నుంచి ముంబైకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత డిజైనర్ అర్జున్ ఖన్నాతో ప్రేమలో పడింది. కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం గడిచిన తర్వాత వారిద్దరూ విడిపోయారు. జీవితంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో మరోసారి హర్షవర్ధన్ రాణేతో డేటింగ్ చేస్తున్నది.

హర్షవర్ధన్ రాణే, కిమ్ శర్మ ఇద్దరూ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులు. కిమ్ శర్మ ఖడ్గం, మగధీర చిత్రాల్లో నటించి మెప్పించింది. హర్షవర్ణన్ రాణే తకిట తకిటా, నా ఇష్టం, అవును, బెంగాల్ టైగర్, ఫిదా, పలు సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించారు.


Click it and Unblock the Notifications











