మోస్ట్ వాంటెడ్ నిర్మాతలను షాక్ కి గురి చేసిన కృష్ణవంశీ..!?
సాదరణంగా పెద్దహీరోలతో పెద్ద ప్రోజెక్ట్ లు చేసేటప్పుడు హీరోల, నిర్మాతల ఇన్వాల్ మెంట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు మోస్ట్ వాటెండ్ డైరెక్టర్స్ మహేష్ బాబు తో కొత్త ప్రొజెక్ట్ లు సైలెంట్ గా లాంచ్ అవుతున్నాయని పిల్మిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజా అందిన సమాచారం ప్రకారం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ఇద్దరు దర్శకులు చేయబోయే చిత్రాలను లీక్ చేసాడు. మహేష్ బాబుతో క్రిష్, శేఖర్ కమమ్ముల సినిమాలు చేయబోతున్నారని చెప్పాడు కృష్ణవంశీ. ఇలా చెప్పడం ఈ సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతోన్న నిర్మాతలను షాక్ కి గురి చేసిందట. ఈ రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలను సీక్రెట్ గా ఉంచాలని ఈ దర్శక నిర్మాతలు భావించారట. అన్ని చర్చలు పూర్తయిన తర్వాత వివరాలు బయటికి చెప్పాలనుకున్నారట. కానీ ఈ లోపే కృష్ణ వంశీ ఈ ప్రాజెక్ట్ ల గురించి లీక్ చేయడం నిర్మాతలకు నచ్చలేదని సమాచరం.
వేదం, గమ్యం చిత్రాలతో తనకంటూ ముద్ర వేసుకున్న దర్శకుడు క్రిష్. ఆయన తాజాగా మహేష్ బాబు ఓ చిత్రం కమిటయ్యారని గతంలో తెలుగులో అనేక సూపర్ హిట్స్ ఇచ్చిన ఓ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్ధ ఈ చిత్రాన్ని నిర్మించనుందని వార్తలు వచ్చిన విషయం విధితమే.


Click it and Unblock the Notifications











