కృతిశెట్టి కోసం టాప్ డైరెక్టర్, నిర్మాత ఫైట్!

సినిమా ఇండస్ట్రీలో రూమర్లకు, గాసిప్స్‌కు ఏ మాత్రం తక్కువ ఉండదు. ఈ రంగంలో ఊహాగానాలు, ప్రచారాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే సినీ తారల గురించిన కథనాలు ఇప్పుడూ ఆసక్తిని రేపుతుండటంతో కొందరు క్రిటిక్స్, జర్నలిస్టులు లీక్స్ రూపంలో వాటిని బయటపెట్టి వైరల్ చేస్తుంటారు. ఇదే మాదిరిగా బాలీవుడ్‌లో అత్యంత వివాదాస్పద జర్నలిస్టు, క్రిటిక్, యాక్టర్ కమల్ ఆర్ ఖాన్ (KRK) ఓ ఆసక్తికరమైన విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా బయటపెట్టారు. ఓ డైరెక్టర్, నిర్మాతకు మధ్య జరిగిన విషయాన్ని గాసిప్‌గా వదిలాడు. ప్రస్తుతం ఆ విషయం కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా అటు దక్షిణాది, ఉత్తరాది సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. కేఆర్కే లీక్ చేసిన విషయం ఏమిటంటే?

ముందు కేఆర్కే విషయానికి వస్తే.. హిందీ సినిమా పరిశ్రమలో అత్యంత వివాదాస్పద వ్యక్తిగా పేరుంది. ఆయన తన వీడియోల ద్వారా బాలీవుడ్‌లోని సంచలన విషయాలు, ఫేక్ బాక్సాఫీస్ నంబర్లను బయటపెడుతుంటారు. అలాగే తారల మధ్య ఉన్న సంబంధాలను లీక్ చేస్తుంటాడు. అయితే తాజాగా ఓ హౌసింగ్ కమ్యూనిటీలో కాల్పులకు పాల్పడ్డారనే విషయంపై ఆయన అరెస్ట్ అయ్యారు. కొన్ని రోజుల రిమాండ్ తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.

Krithi Shetty

ఇక KRK ఎప్పటిలానే తన ధోరణిలో ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. తెలుగులోను, తమిళంలోను స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన కృతిశెట్టి గురించి ఆయన ట్రోలింగ్ చేస్తూ పోస్టు పెట్టారు. ఓ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేయడానికి ఓ డైరెక్టర్, నిర్మాత ఫైటింగ్ చేసుకొన్నారు. నిర్మాత ఏమో కృతిశెట్టిని తన సినిమా ద్వారా బాలీవుడ్‌లో లాంచ్ చేయాలని భావించాడు. కానీ డైరెక్టర్ మాత్రం తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఆ సినిమాలో హీరోయిన్‌గా పెట్టుకోవాలని ప్లాన్ చేశారు. ఈ విషయంలో వారిద్దరికి కుదర్లేదు. దాంతో ఆ ఇద్దరికి హీరోయిన్ ఎంపిక విషయంలో గట్టిగానే ఫైట్ జరిగింది అనే విషయాన్ని తన ట్వీట్‌లో ప్రస్తావించాడు.

ఇక కృతి శెట్టి గురించి తన అభిప్రాయాన్ని చెబుతూ.. డైరెక్టర్ తీసుకోవాలని అనుకొన్న గర్ల్‌ఫ్రెండ్, కృతిశెట్టిలో ఎవరిని తీసుకొన్నా.. ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇద్దరు హారిబుల్ హీరోయిన్సే. కృతిశెట్టిని చూస్తే 100 శాతం సౌత్ హీరోయిన్ ముఖంలా ఉంటుంది. హిందీ ఆడియెన్స్‌ ఏ మాత్రం నచ్చరు అంటూ ఆయన కామెంట్ చేశాడు. కృతిశెట్టి ఫోటోను పెట్టి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అయింది. ఈ వార్తపై రకరకాల కథనాలు బయటకు వస్తున్నాయి. ఇంతకు ఆ నిర్మాత, దర్శకుడు ఎవరు? అనే విషయంపై నెటిజన్లు, సినీ వర్గాలు ఆరా తీస్తున్నాయి.

కృతిశెట్టి కెరీర్ విషయానికి వస్తే.. ఆమె సూపర్ 30 అనే చిత్రంతోనే హిందీ సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన సినిమాలో నటించింది. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో తెలుగులో అవకాశాలు వెతుక్కొంటూ వచ్చాయి. శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు, మాచెర్ల నియోజకవర్గం, ది వారియర్, మనమే, ఆర్మ్, వా వాతియార్ సినిమాల్లో నటించింది. అయితే ఇటీవల కాలంలో ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమె గ్రాఫ్ కాస్త తడబాటుకు గురైంది. ఆమె నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ కావాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: krithi shetty bollywood krk
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X