9 ఏళ్ల చిన్నవాడితొో మహేష్ బాబు హీరోయిన్ ఎంగేజ్‌మెంట్? కాబోయే భర్త ఎవరంటే?

సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో హీరోయిన్ల డేటింగ్, అఫైర్, రిలేషన్‌షిప్ వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. కొందరు గ్లామర్ హీరోయిన్లు పెళ్లికి సిద్దమైనారంటూ వార్తలు ఓ పక్క హల్‌చల్ చేస్తుండగా.. మరో పక్క టాప్ హీరోయిన్స్ ఎంగేజ్‌మెంట్‌కు సిద్దమవుతున్నారనే వార్తలు జోరుగా మీడియాలో షికారు చేస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హాట్ న్యూస్‌తో క్రేజీగా మారిన హీరోయిన్లలో కృతిసనన్ ఒకరు. ఆమె డేటింగ్ వార్తలు ఇప్పడు మీడియాలో హెడ్‌లైన్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా తన మీద వస్తున్న గాసిప్ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో పలువురు హీరోలతో అఫైర్ ముడిపెడుతూ వార్తలు వచ్చిన వారిలో కీర్తి సనన్ ఒకరు. అయితే ఆమె అఫైర్, బ్రేకప్ వార్తలు మీడియాలో నిత్యం ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో యువ బిజినెస్ మ్యాన్ కబీర్ బహియాతో ఆమె తరుచూ సన్నిహితంగా కనిపించడంతో డేటింగ్ రూమర్లు గుప్పుమన్నాయి. అయితే వారిద్దరూ తమ రిలేషన్‌షిప్ గురించి వివరణ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు.

Kriti Sanon engaged to Boyfriend Kabir Bahia

అయితే 35 ఏళ్ల కృతిసనన్ 26 ఏళ్ల ప్రియుడితో అఫైర్ కొనసాగించడం మీడియాలో చర్చనీయాంశమైంది. వారిద్దరి మధ్య 9 ఏళ్ల వయసు తేడా ఉండటంపై రకరకాల చర్చ జరిగింది. అయితే మీడియాలో వచ్చే వార్తలను పట్టించుకోకుండా తన ప్రియుడు కబీర్‌తో కలిసి లార్డ్స్‌లో క్రికెట్ చూడటం, ఫారిన్‌లో వెకేషన్స్‌కు వెళ్తూ జోరును కనిపించింది. ఇలా ఆమె తన అఫైర్ వార్తలతో బిజీగా మారింది.

అయితే ఇటీవల తన సోదరి నూపుర్ సనన్ వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లికి తన ప్రియుడు కబీర్‌తో కలిసి వెళ్తూ ఎయిర్‌పోర్టులో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. తనతో ఉన్న కబీర్‌తో కలిసి ఉన్నప్పుడు ఫొటోలు తీయవద్దని మీడియాను కోరింది. అయినా ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించడంతో ఆమె కొంత అసహనం వ్యక్తం చేసింది.

అయితే నూపూర్ సనన్ పెళ్లి సమయంలో కృతిసనన్ చేతికి ఉంగరం కనిపించింది. ఆ ఉంగరం స్పెషల్‌గా ఉండటంతో ఎంగేజ్‌మెంట్ రింగ్ అంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే కబీర్‌తో కృతి సనన్ ఎంగేజ్‌మెంట్ జరిగిపోయిందనే వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే ఈ వ్యవహారంపై ఆమె పెదవి విప్పకుండా గుంభనంగా ఉండటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కృతిసనన్ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె తొలి చిత్రం తెలుగులోనే మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే చిత్రంతో ప్రారంభమైంది. ఆ తర్వాత టైగర్ ష్రాఫ్‌తో హీరోపంతి నటించింది. ఆ తర్వాత దిల్ వాలే, మిమి, హౌస్‌ఫుల్ 4, బచ్చన్ పాండే, ఆదిపురుష్, గణ్‌పత్, తెరే ఇష్క్ మే చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన కాక్‌టెయిల్ 2 చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.

More from Filmibeat

Read more about: kriti sanon kabir bahia bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X