Engagement: సీక్రెట్‌గా కృతి సనన్ ఎంగేజ్‌మెంట్.. 9 ఏళ్ల వయసు చిన్నోడితో నిశ్చితార్థం?
బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువైన హీరోయిన్ కృతి సనన్. మహేష్ బాబుతో కలిసి 1 నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఇటీవల ఆదిపురుష్ సినిమా ద్వారా మరింత చేరువైంది. అయితే తాజాగా ఈ టాప్ హీరోయిన్ రకరకాల వార్తలతో మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా మారింది. కృతిసనన్‌కు సంబంధించిన వార్తల వివరాల్లోకి వెళితే..
కృతిసనన్ తాజాగా ధనుష్‌తో కలిసి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారనే విషయం టాప్ న్యూస్‌గా మారింది. ఆదిపురుష్ తర్వాత మరోసారి సౌత్ హీరోతో ఆమె నటించనున్నారనే వార్త అందర్నీ ఆకర్షించింది. అయితే ఈ సినిమా గురించి యూనిట్ కూడా దాదాపు ధృవీకరించింది.

బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్‌లో కృతి సనన్, ధనుష్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు తేరే ఇష్క్ మే అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మన్ సంగీతం అందించారు. యాక్షన్, లవ్ స్టోరిగా ఈ సినిమా రూపొందుతున్నది.
కృతిసనన్ కెరీర్ విషయాన్ని పక్కన పెడితే.. ఆమె తన ప్రియుడితో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకొన్నదనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే తన ప్రియుడు కబీర్ బాహియాతో గ్రీస్ దేశంలో నిశ్చితార్థం జరిగింది. తన కంటే 9 ఏళ్లు చిన్నవాడైన లవర్‌ను పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ అయింది.
కృతిసనన్ ఎంగేజ్‌మెంట్ న్యూస్ వివాదాస్పద క్రిటిక్ ఉమేర్ సంధూ ట్వీట్ చేయడంతో అనేక సందేహాలు వ్యక్తవుతున్నాయి. ఉమేర్ సందూ ట్వీట్ చేసేవన్నీ వాస్తవాలకు దూరంగా ఉంటాయి. అయితే ఈ వార్తపై కృతిసనన్ స్పందిస్తే.. తప్పా ఈ వార్త విషయంలో వాస్తవం ఏంటో తెలుస్తుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











