Breakup: తమన్నా బ్రేకప్ వెనుక ఆ స్టార్ హీరోయిన్ హస్తం!
సినీ పరిశ్రమలో ఇటీవల హాట్ హాట్‌గా చర్చ జరిగిన అంశం విషయానికి వస్తే.. అది తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ వ్యవహారమే. అయితే వారిద్దరి బ్రేకప్ వార్త రకరకాల ఊహాగానాలకు దారి తీసింది. అయితే వారిద్దరూ మాత్రం తమ జీవితాల్లో ఏమీ జరగలేదనట్టు మీడియాకు కనిపించారు. అయితే మిల్కీ బ్యూటీ ముఖంలో ఏ మాత్రం బ్రేకప్‌కు సంబంధించిన బాధ, ఫీలింగ్ కనిపించకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే తమన్నా, విజయ్ వర్మ లవ్ బ్రేకప్ వెనుక ఓ హీరోయిన్ ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌లో తమన్నా, విజయ్ వర్మ అఫైర్ గురించి గుసగుసలు వినిపించినప్పటికీ.. 2022 సంవత్సరం డిసెంబర్ 31 గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో ఇద్దరు కలిసి అన్యోన్యంగా కనిపించడంతో వారిద్దరి మధ్య అఫైర్ విషయం కన్ఫార్మ్ అయింది. ఆ తర్వాత ఎలాంటి భయం లేకుండా మీడియా ముందుకు వచ్చి ఫుల్ రొమాంటిక్‌గా ఫోజులివ్వడంతో వారి మధ్య బలమైన బంధమే ఏర్పడిందనే ఫీలింగ్ అందరికి కనిపించింది.

దాదాపు రెండున్నర సంవత్సరాలుగా మిల్కీ బ్యూటీతో విజయ్ ప్రేమ యాత్ర సాగింది. అయితే ఇద్దరు కలిసి ఉండే తీరును చూస్తే వారిద్దరి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు. వారిద్దరి మధ్య అవగాహన బెటర్‌గా ఉందనే అభిప్రాయం అందరికి కలిగింది. ఇక వారి కెమిస్ట్రీ చూస్తే పెళ్లి చేసుకోవడం ఖాయమని అందరూ భావించారు.
అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తమన్నా, విజయ్ వర్మ తమ బ్రేకప్‌ను ప్రకటించేశారు. తమన్నా, విజయ్ తమ ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ల నుంచి తమ ఫోటోలను డిలీట్ చేసుకోవడంతో ఈ బ్రేకప్ వాసనను మీడియా పసిగట్టింది. అయితే వారిద్దరు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. వారి మౌనం మాత్రం అందుకు అధికారికంగా ముద్ర వేసింది.

విజయ్‌తో తమన్నా అఫైర్ బ్రేకప్‌కు కారణాలు అంటూ రకరకాల ఊహాగానాలు మీడియాలో కనిపించాయి. అయితే విజయ్‌ను పెళ్లి చేసుకోమని తమన్నా అడిగితే అందుకు నిరాకరించారు. ఇంకా నాలుగైదు సంవత్సరాలు వెయిట్ చేయమని అడిగాడు. అందుకు వీలు కాకపోవడంతో తమన్నా, విజయ్ వర్మ ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకొన్నారు అని మీడియాలో కథనాలు వచ్చాయి.
అయితే తాజాగా మరో అంశం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇటీవల జైపూర్‌లో జరిగిన ఐఫా ఈవెంట్‌కు విజయ్ వర్మ హాజరయ్యారు. అయితే తమన్నాతో కాకుండా కృతి సనన్‌తో ఆయన కనిపించారు. వారిద్దరూ కలిసి మీడియాకు ఫోజులిచ్చారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇద్దరు కలిసి మాట్లాడారు. దాంతో తమన్నా బ్రేకప్ అసలు కారణం కృతి సనన్ అంటూ ఓ రూమర్ వైరల్ అవుతున్నది. అయితే ఇది వాస్తవమా? రూమారా? అనేది కొద్ది రోజులు ఆగితే తెలియడం ఖాయం.
ఇదిలా ఉండగా, తమన్నా భాటియా కెరీర్ విషయానికి వస్తే.. 2024 సంవత్సరంలో అరణ్మయి 4, స్త్రీ 2, వేదా, సికందర్ కా ముకందర్ చిత్రాల్లో నటించింది. స్త్రీ 2 సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ యువతను ఉర్రూతలూగించింది. ఇక 2025 సంవత్సరంలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఓదెల 2 సినిమాలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











