Kill Remake: కిల్ రీమేక్‌లో స్టార్.. కళ్లు చెదిరే రేటుకు బ్లాక్‌బస్టర్ మూవీ రైట్స్!

ఒకప్పుడు ఎవరికైనా ఇండియన్ సినిమా అంటే ఒక్క బాలీవుడ్ సినిమానే అని చాలా మంది అనుకునేవారు. ఇప్పటికీ కొంతమంది అలానే అనుకుంటున్నారు కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. కాగా ప్రస్తుతం తెలుగు సినిమా డామినేషన్ మొదలు కావడంతో ఇండియన్ సినిమా దగ్గర మరో బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా మన తెలుగు సినిమా అవతరించింది. దీనితో మన తెలుగు సినిమా అలా పెద్దది అవుతుండగా బాలీవుడ్ సినిమా పడిపోవడం స్టార్ట్ అయ్యింది.

దీనితో బాలీవుడ్ మార్కెట్ ఘోరంగా గడిచిన మూడేళ్లు చూసింది. అయితే ఫైనల్ గా షారుఖ్ ఖాన్ తన సినిమాలతో మళ్ళీ బాలీవుడ్ కి ఊపిరి పోసాడు. ఇక్కడ నుంచి మళ్ళీ బాలీవుడ్ సినిమా ఊపందుకోగా ఈ ఏడాది కూడా పలు భారీ హిట్స్ పడ్డాయి. అయితే ఈ ఏడాదిలోనే బాలీవుడ్ నుంచి వస్తున్నా రొటీన్ సినిమాలకి భిన్నంగా ఓ సినిమా వచ్చి సెన్సేషన్ ని రేపింది. కాగా ఆ సినిమానే "కిల్".

is lawrence Raghava making bollywood hit kill remake in telugu and tamil

పూర్తిగా ఒక హాలీవుడ్ లెవెల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లవర్స్ పాలిట ట్రీట్ గా నిలిచింది. హీరో కానీ హీరోయిన్ కానీ దర్శకుడు కూడా పెద్దగా ఎవరికీ తెలీదు. ఇలాంటి సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఒక్కసారిగా ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. మరి ఒకవేళ ఇదే సినిమా కానీ ఓ స్టార్ హీరో తీసుంటే ఈజీగా 1000 కోట్లు కలెక్ట్ చేసి ఉండేది అని చూసిన వారు అభిప్రాయపడ్డారు.

దీనితోనే ఈ సినిమా రీమేక్ హక్కులకి సౌత్ లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఇలా తెలుగు సహా తమిళ్ నుంచి పలువురు యంగ్ హీరోలు ఈ సినిమా చేసేందుకు చాలా ఆసక్తి చూపించారు. కానీ ఫైనల్ గా ఓ క్రేజీ స్టార్ అయితే ఈ రీమేక్ లో కనిపించనున్నట్టుగా ఇప్పుడు వినిపిస్తుంది. కాగా ఆ హీరో ఎవరో కూడా కాదు ప్రముఖ డాన్స్ మాస్టర్, హారర్ కామెడీ సినిమాల స్పెషలిస్ట్ రాఘవ లారెన్స్ అట.

తన నుంచి ఇటీవల ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ సబ్జెక్టు మొదలు అయ్యినట్టుగా ఓ క్రేజీ పోస్టర్ తో తన కెరీర్ 25వ సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇది కిల్ రీమేక్ అని అఫీషియల్ గా ఎక్కడా చెప్పలేదు కానీ దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఓ రీమేక్ అన్నట్టు వినిపిస్తుంది.

నిర్మాత, విద్యావేత్త, కె.ఎల్‌. యూనివర్శిటీ ఛైర్మన్‌ కోనేరు సత్యనారాయణ గురించి టాలీవుడ్‌లో తెలియనివారే ఉండరు. రాక్షసుడు, ఖిలాడీలాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాల నిర్మాతగా ఆయన అందరికీ సుపరిచితులు. ఎ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్‌ పీ పతాకంపై పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు కోనేరు సత్యనారాయణ. నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్‌ ప్రొడక్షన్స్ తో కలిసి లేటెస్ట్ ప్రాజెక్టును కోనేరు సత్యనారాయణ అనౌన్స్ చేశారు.

is lawrence Raghava making bollywood hit kill remake in telugu and tamil

రాఘవ లారెన్స్ ఈ తాజా సినిమాలో హీరోగా నటించనున్నారు. అత్యంత భారీ వ్యయంతో ప్రాజెక్టును తెరకెక్కించనున్నారు మేకర్స్. కొరియోగ్రాఫర్‌గా అత్యున్నత ప్రతిభ కనబరిచి హీరోగా మెప్పిస్తున్న రాఘవ లారెన్స్ కెరీర్‌లో ఇది 25వ సినిమా కావడం గమనార్హం. న‌వంబ‌ర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి 2025 స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

గతంలో రమేష్ వర్మ "రాక్షసుడు" అనే సినిమాని హీరో బెల్లంకొండ శ్రీనుతో చేసాడు. అది మంచి హిట్ అయ్యింది. సోరీమేక్ హ్యాండిల్ చేయడంలో మంచి పనితనం తాను ఇప్పుడు కిల్ రీమేక్ భాద్యతలు రాఘవ లారెన్స్ హీరోగా చేపట్టనట్టుగా తమిళ సినీ వర్గాలే చెబుతున్నాయి. ఇంకా ఈ పోస్టర్ లో గమనించినట్టు అయితే లారెన్స్ ఓ రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నట్టు కనిపిస్తున్నాడు. మరి కిల్ సినిమా కూడా మొత్తం ట్రైన్ లోనే జరుగుతుంది. మరి చూడాలి ఆ సినిమా ఈ సినిమానేనా కాదా అనేది.

More from Filmibeat

Read more about: kill movie lakshya raghav juyal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X