పోకిరి ని మగధీర చిత్రం క్రాస్ చేసిందా?
రామ్ చరణ్ తేజ, కాజల్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర చిత్రం పోకిరి కలెక్షన్స్ ని క్రాస్ చేసిందని విశ్లేషకులు కన్ఫర్మ్ చేస్తున్నారు. వందరోజుల నాటికి దాదాపు ఎనభై కోట్ల షేర్ మొత్తాన్ని రాబట్టుతుందని అంచనాలు వేస్తున్నారు. దాంతో పోకిరి రికార్డును డబుల్ రేంజిలో బ్రద్దలు కొట్టి ఆ మార్జిన్ ని దాటినట్లేనని చెప్తున్నారు. అయితే కొన్ని వర్గాల నుండి ఈ విషయమై అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనికి సమాధానంగా ఓ టీవి ఛానెల్ లో పూరీ జగన్నాధ్ క్లారిఫై చేసారు. పోకిరిని మగధీర చిత్రం క్రాస్ చేసిందని అంటూ..తిరిగి తానూ త్వరలోనే మగధీర రికార్డును దాటటానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అదీ విషయం.
రామ్ చరణ్ తేజ కాజల్ పోకిరి రాజమౌళి పూరీ జగన్నాధ్ మహేష్ మగధీర ఇలియానా అల్లు అరవింద్ magadheera ram charan kajal rajamouli pokiri mahesh babu puri jagannath


Click it and Unblock the Notifications