మహేష్ బాబుపై పుస్తకం.. కాంట్రవర్సీగా మారనుందా?
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై ప్రముఖ జాతీయ మేగజైన్ 'ఇండియా టుడే' 120 పేజీల స్పెషల్ ఎడిషన్ విడుదల చేసేందుకు ప్లాప్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసింతే. ఆ పుస్తకం రాకముందే ఓ ఆసక్తికర చర్చ మొదలైంది.
చిరంజీవి తర్వాత టాలీవుడ్‌లో నెం.1 స్థానం ఎవరిది? అనే అంశంపై కొంత కాలంగా వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోలుగా ఉన్న మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో టాప్ అంటే తమ హీరో టాప్ అని ఎవరికి వారే వాదిస్తున్నారు. ఈ వివాదం ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది.
గతంలో చిరంజీవిపై స్పెషల్ ఎడిషన్ రిలీజ్ చేసిన ఇండియా టుడే... ఆ తర్వాత మహేష్ బాబును అదే స్థాయిలో ఫోకస్ చేయడానికి సిద్దం కావడం వల్ల...టాలీవుడ్ నెం.1 ఎవరు? అనే వివాదానికి తెర లేవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో వివిధ హీరోల ఫ్యాన్స్ మధ్య జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా కొందరు గుర్తు చేసుకుంటున్నారు. మరి ఏం జరుగబోతోందో? చూడాలి.
mahesh babu chiranjeevi ram charan teja pawan kalyan jr ntr మహేష్ బాబు చిరంజీవి రామ్ చరణ్ తేజ్ పవన్ కళ్యాణ్ జూ ఎన్టీఆర్


Click it and Unblock the Notifications
