మహర్షికి పోకిరి ఎఫెక్ట్... మహేష్‌కు ఈసారి కూడా కలిసి వస్తుందా?

Recommended Video

Maharshi Movie : Team Planned To Release Movie On April 9 | Filmibeat Telugu

భరత్ అనే నేను లాంటి భారీ సక్సెస్ తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబు మరో హిట్టుపై కన్నేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే చిత్రం మహర్షిలో ప్రిన్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్, అమెరికా, ఉత్తర భారతదేశంలో శరవేగం పూర్తి చేసుకొని బ్యాలెన్స్ సన్నివేశాలను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో సినిమా రిలీజ్ డేట్‌పై ఆసక్తికరమైన వార్త మీడియాలో ప్రచారమవుతున్నది. ఆ వార్త ఏమిటంటే..

వాస్తవానికి మహర్షి మూవీ రిలీజ్

వాస్తవానికి మహర్షి మూవీ రిలీజ్

వాస్తవానికి మహర్షి చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 9న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఉగాది పండుగ నేపథ్యంలో వచ్చే లాంగ్ వీకెండ్‌ను సొమ్ము చేసుకోవాలని కన్నేశారు. కానీ ఓ సెంటిమెంట్ మధ్యలో దూరి రిలీజ్ డేట్‌ను వెనుకకు జరిగేలా చేసినట్టు సినీ వర్గాలు తెలుపుతున్నాయి.

మహేష్‌బాబుకు ఏప్రిల్ సెంటిమెంట్

మహేష్‌బాబుకు ఏప్రిల్ సెంటిమెంట్

ప్రిన్స్ మహేష్ బాబుకు ఏప్రిల్ చివరివారం బాగా కలిసి వస్తుందట. గతంలో వచ్చిన పోకిరి బ్లాక్‌బస్టర్ కావడమే కాకుండా, కలెక్షన్లపరంగా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డును సృష్టించింది. పోకిరి సినిమాతో ఓ రేంజ్‌ స్టార్‌డమ్‌ను కూడా సొంతం చేసుకొన్నాడు మహేష్ బాబు.

పోకిరి, భరత్ అనే నేను రేంజ్‌లో

పోకిరి, భరత్ అనే నేను రేంజ్‌లో

ఇక ఈ మధ్య భరత్ అనే నేను సినిమా కూడా ఏప్రిల్ చివరివారంలో రిలీజై రికార్డులు తిరుగరాసింది. మహేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లను సాధించిన మూడో చిత్రంగా భరత్ అనే నేను ఘనతను సాధించింది.

ఏప్రిల్ చివరివారంలో విడుదల

ఏప్రిల్ చివరివారంలో విడుదల

ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకొన్న చిత్ర యూనిట్ మహర్షి రిలీజ్ డేట్ విషయంపై మరోసారి ఆలోచిస్తున్నారట. అదే క్రమంలో మహర్షి సినిమాను ఏప్రిల్ రిలీజ్ చేసి సూపర్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకొనేందుకు సిద్దమవుతున్నారు. ప్రిన్స్ మహేష్‌కు ఈ సెంటిమెంట్ అచ్చిరావడంతో రిలీజ్‌ను వెనకకు జరిపినట్టు తెలుస్తున్నది. అధికారికంగా వెల్లడిస్తే కానీ ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.

జయప్రద కీలక పాత్రలో

జయప్రద కీలక పాత్రలో

గ్రామీణ, అర్బన్ కథాంశంతో తెరకెక్కుతున్న మహర్షి చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినిదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట‌్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూఎస్‌లో ఎక్కువ భాగం షూట్ చేశారు. పూజా హెగ్డే, అల్లరి నరేష్‌తోపాటు జయప్రద ఓ కీలక పాత్రలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X