మహేష్ బాబు కొత్త చిత్రం 'నందలాల'?
మహేష్ బాబు మరో చిత్రం కమిటయ్యారని దాని టైటిల్ 'నందలాల' అని విశ్వసనీయ సమాచారం. జాస్తి హేమాంభర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. టాలీటు హాలీ మూవీస్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఓ తమిళ రీమేక్ అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. తమిళంలో ప్రముఖ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొంది రిలీజైంది. అలాగే గతంలో జాస్తి హేమాంబర్ మహేష్ నటించిన కొన్ని సినిమాలకు కో డైరెక్టర్‌గా వ్యవహరించారు. అక్కడే జాస్తికి మహేష్ తో సన్నిహితత్వం కూడా ఏర్పడింది. దాంతో మహేష్ కి ఒక కథ చెప్పటం జరిగింది. అతను చెప్పిన కథ నచ్చడంతో అతని దర్శకత్వంలో నటించేందుకు మహేష్ పచ్చ జెండా ఊపాడు. అలా 'మిర్చి' ప్రాజెక్టు రంగం మీదికి వచ్చింది.
'అతిథి' తర్వాత మహేష్ చేయాల్సిన సినిమా ఇదే. 2007 డిసెంబరులో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి రంగం సిద్దమయ్యింది. దీంతో మహేష్ వంటి సూపర్ స్టార్ తో తన కెరీర్ ప్రారంభం కాబోతున్నందుకు జాస్తి ఎంతగానో సంతోషపడ్డాడు. రొమాంటిక్ కామెడీగా దాన్ని తీర్చిదిద్దేందుకు స్క్రిప్టును పకడ్బందీగా తయారు చేసుకున్నాడు. దుర్గా ఆర్ట్స్ బానర్‌పై కెఎల్ నారాయణ, ఎస్ గోపాల్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించాలని సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ను, ఆర్ట్ డైరెక్టర్ గా అశోక్ ను ఎంచుకున్నారు. హైదరాబాద్ శివార్లలో ఒక భారీ సెట్‌ను నిర్మించడానికి అశోక్ పనులు కూడా మొదలుపెట్టాడు. అంతలోనే 'మిర్చి'ని చేయనని నిర్మాతలకు కబురు పెట్టాడు మహేష్. అలా అప్పట్లో ఆగిపోయిన చిత్రం దర్శకుడుకి మళ్లీ ఇన్నాళ్ళుకు మహేష్ సినిమా ఇస్తున్నాడు.
ప్రస్తుతం మహేష్ బాబు..త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. శింగనమల రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్ గా చేస్తోంది. అనంతరం శ్రీను వైట్ల డైరక్షన్ లో చిత్రం చేయటానికి కమిటయ్యారు. ఇందులో సమంతను హీరోయిన్ గా ఎంపిక చేసారు.


Click it and Unblock the Notifications











