మహర్షికి మరో తలనొప్పి.. కోతల వాతలతో గందరగోళం!

సూపర్‌స్టార్ మహేష్‌బాబు తాజా చిత్రం మహర్షి సెట్స్‌పై ఉండగానే రకరకాల వార్తలతో సెన్సేషనల్‌గా మారుతున్నది. అనేక వార్తలు ఈ సినిమా గురించి వినిపిస్తున్నాయి. తాజాగా మహర్షి సినిమా నడివి, రిలీజ్ డేట్ విషయాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అశ్వినీదత్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త సమస్య ఏ రకంగా ఇబ్బందిగా మారిందంటే...

మంచి సందేశంతో మహర్షి

మంచి సందేశంతో మహర్షి

మహర్షి సినిమా సమాజానికి ఓ సందేశం ఇచ్చే చిత్రంగా తెరకెక్కుతున్నది. ఓ యువ పారిశ్రామిక వేత్త వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టారనే విషయం కథగా రూపొందుతుందట. దాదాపు ఈ కథను వంశీ పైడిపల్లి రెండేళ్లు శ్రమించి రాసుకొన్నారనేది సినీ వర్గాల టాక్.

భారీగా పెరిగిన నిడివి

భారీగా పెరిగిన నిడివి

మహర్షి సినిమా సుమారు ఏడాదిగా సెట్స్‌పై ఉంది. అమెరికా, ఉత్తర భారతంలోని కొన్ని ప్రదేశాల్లో ఈ సినిమాను చిత్రీకరించారు. భారీ తారాగణంతో ఈ సినిమా షూటింగ్ జరుపుకొన్నది. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా ఓ సెట్‌ను కూడా వేశారు. ఇలా రకరకాల షేడ్స్‌ ఉండటంతో సినిమా నిడివి భారీగా పెరిగిందట.

4 గంటల రన్‌టైమ్

4 గంటల రన్‌టైమ్

సినీ, మీడియా కథనాల ప్రకారం.. మహర్షి సినిమా రన్ టైమ్ (నిడివి) తొలుత 4 గంటలు వచ్చిందట. దానిని కొంత మేరకు కుదించగా అది 3.20 నిమిషాలకు, ఆ తర్వాత మరికొంత తగ్గిందట. అయితే ఇలా కత్తెర్లు వేసుకొంటూ పోతే కథలో అసలు విషయం దెబ్బ తినే ప్రమాదముందనే అభిప్రాయం చిత్ర యూనిట్ నుంచి వ్యక్తమవుతుందట.

నిడివిపై కోతలు, వాతలు

నిడివిపై కోతలు, వాతలు

కథలో కీలకమైన ఎలిమెంట్స్‌ను, కథనంలో వేగం, ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్రాక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శకుడు వంశీ పైడిపల్లి తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారట. మూడు గంటల కంటే తక్కువ నడివిలో ఎలాంటి సీన్లు ఉంచాలనే విషయంపై తర్జన భర్జన మొదలైందట. చాలా ఇష్టంగా చిత్రీకరించిన కొన్ని సీన్లను త్యాగం చేయడం తప్పనిసరిగా మారిందనే మాట వినిపిస్తున్నది.

పూజా హెగ్డే జంటగా

పూజా హెగ్డే జంటగా

ప్రిన్స్ మహేష్ బాబు, బ్యూటీ పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. సొనాల్ చౌహాన్, మీనాక్షి దీక్షిత్ తదితరులు కనిపిస్తారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పాటలు రిలీజ్ చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X