మహేశ్ బాబు తనయుడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ.. నమత్ర వీడియో వైరల్
టాలీవుడ్ కొత్త జనరేషన్ కోసం సిద్దమవుతుంది. నెపోటిజం వద్దు అంటున్న ప్రేక్షకులే స్టార్ హీరోల కొడుకులు ఇండస్ట్రీలోకి రావాలని కోరుతున్నారు. అయితే బాలీవుడ్ లో ఉన్నంత నెపోటిజం మాత్రం టాలీవుడ్ లోలేదు . ఇక్కడ స్టార్స్ వారసులు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి మాత్రమే తమ తండ్రుల పేర్లను వాడుకుంటారు. ఆ తరువాత వారి సత్తా వారే చూపించాలి. అలా కాదని ఇంకా తండ్రి పేర్లు చెప్పుకుంటూ ఉంటే.. ప్రేక్షకులే షెడ్ కు పంపిస్తారు. అలా వచ్చి వెళ్లిపోయిన నేపో చాలా మందే ఉన్నారు.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈసారి జనరేషన్ పక్కా గట్టి పోటీ ఇవ్వబోతుందని చెప్పొచ్చు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు మధ్య పోటీ ఉండేది. తరువాత వారి పిల్లలు బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, పవన్.. ఈ జనరేషన్ వచ్చి చేరింది. దీని తరువాత వీరైతే పాటే కుర్ర హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగ చైతన్య.. వచ్చి చేరారు. ప్రస్తుతం ఇండస్ట్రీని వీరే ఏలుతున్నారు. ఇక ఇప్పుడు వీరి మధ్యలోకి మరో తరం రానుంది. అది కూడా వీరిలానే గట్టిపోటీని ఇచ్చే కుర్రాళ్ళ దిగబోతున్నారు.

ఇక వారందరిలో ముగ్గురి మీద అభిమానులు భారీ ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. మొట్ట మొదటగా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ.. ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీలో అడుగుపెడతాడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది.. వచ్చే ఏడాది అంటూ ఇంకా బాలయ్య.. మోక్షజ్ఞ ఎంట్రీని వాయిదా వేస్తూనే ఉన్నాడు.
ఇక మోక్షు కాకుండా అందరూ ఎదురు చూసే వారసుడు మెగా వారసుడు అకీరా నందన్. గత కొన్నిరోజులుగా అకీరా సోషల్ మీడియా సెన్సేషన్ గామారిపోయాడు. పవన్ ఎన్నికల్లో గెలిచాకా.. ఎక్కడకు వెళ్లినా కొడుకుతోనే వెళ్ళాడు. ఇక తండ్రి రాజకీయాల్లో బిజీ కాబట్టి.. కొడుకు ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞకు సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందో లేదో తెలియదు కానీ.. అకీరాకు మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో ఈ కుర్రాడు ఎప్పుడు ఇండస్ట్రీలో అడుగుపెట్టినా అది సెన్సేషన్ గా మారుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఇక ఈ ఇద్దరు వారసులు కాకుండా.. మరో వారసుడు పై కూడా అభిమానుల కళ్లు పడ్డాయి. అతడే ఘట్టమనేని వారసుడు గౌతమ్ ఘట్టమనేని. మహేష్ బాబు - నమ్రతల ముద్దుల కొడుకు. చిన్నతనం నుంచి గౌతమ్ సోషల్ మీడియాకు కొద్దిగా దూరంగానే పెరిగాడు. సితార పాప ఇప్పటికే స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతోంది. కానీ, గౌతమ్ తన దృష్టి మొత్తాన్ని చదువుపైనే పెట్టాడు. ఈ మధ్యనే ఇంటర్ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు.
మరో రెండేళ్లలో గౌతమ్ సైతం 20 కి చేరుకుంటాడు. ఇప్పటికే తండ్రి పోలికలను పుణికిపుచ్చుకొని హీరోలానే కనిపిస్తాడు. ఇక ఇప్పుడు ఆ బాడీకి కొద్దిగా ఫిట్ నెస్ ను యాడ్ చేస్తున్నాడు. అవును.. గౌతమ్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను నమ్రత షేర్ చేసింది. మొన్నటివరకు నమ్రత వెనుక, చెల్లెలి పక్కన సిగ్గుపడుతూ నిలబడ్డ గౌతమ్.. నేడు జిమ్ లో షర్ట్ విప్పి వర్కవుట్స్ చేస్తూ కనిపించాడు.
తండ్రిలానే తన బాడీని తనకు తాను బిల్డ్ చేసుకుంటున్న గౌతమ్ నుంచి మహేష్ అభిమానులు మురిసిపోతున్నారు. వారసుడు వచ్చే సమయం ఆసన్నమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఘట్టమనేని వారసుడి ఎంట్రీ ఉండవచ్చని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ ముగ్గురు వారసుల్లో ఎవరు మొదటగా వచ్చి ప్రేక్షకులకు మెప్పిస్తూ.. కుటుంబ లెగసీని ముందుకు తీసుకెళ్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











