మహేష్ బాబు...త్రివిక్రమ్ కాంబినేషన్ లో తయారయ్యే 'వరుడు' సినిమాపై రకరకాల టాపిక్స్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. అందులో ఒకటి 'వరుడు' తెలుగువాడు కాదని అక్షయ్ కుమార్ హిందీలో చేసిన 'వెల్కమ్' నుంచి పుడుతున్నాడని. అందులో హీరో ఒక అమాయకుడు. అతన్ని అనిల్ కపూర్,నానాపటేకర్ అనే గ్యాంగ్ స్టర్స్ తమ చెల్లికి ఇచ్చి చేయటానికి తాపత్రయపడుతూంటారు. వాటి మధ్య జరిగే కామెడీ నే సినిమాని నిలబెట్టింది. ఇప్పుడది తెలుగులోకి వచ్చి త్రివిక్రమ్ బాణీలో కామిడీని పంచబోతుందంటున్నారు .అయితే గ్యాగస్టర్స్ పాత్రలు ఎవరు చేస్తారనేది ప్రశ్న. దానికి నానాపటేకర్ పాత్రకి మోహన్ బాబు సరిపోతాడు అంటున్నారు. అందుకే ఆయన్ని తీసుకున్నాడంటున్నారు. యేదైమైనా త్వరలో మంచి కామెడీ ని తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారన్నమాట.