యంగ్ హీరోతో సీనియర్ హీరోయిన్ బ్రేకప్.. ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు వైరల్ కావడంతో..!

బాలీవుడ్ తారలు మలైకా అరోరా, అర్జున్ కపూర్ సహజీవనం వ్యవహారం గురించి మీడియాలో రోజుకో వార్త రకరకాల వినిపిస్తుంది. గతంలో ఎన్నోసార్లు వారిద్దరూ విడిపోయారనే వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. అయితే ఆ వార్తలన్నీ తప్పుడు ప్రచారమని పలుమార్లు నిరూపించారు. అయితే తాజాగా వారిద్దరూ విడిపోయారనే విషయం బాలీవుడ్ మీడియాలో వైరల్ అయింది. అందుకు కారణం మలైకా అరోరా పెట్టిన పోస్టు అనేక అనుమానాలకు తావివిచ్చింది. ఆ పోస్టు గురించి, మలైకా, అర్జున్ కపూర్ డేటింగ్ వ్యవహారం గురించిన వివరాల్లోకి వెళితే..

మలైకా అరోరా తన భర్త అర్బాజ్ ఖాన్‌తో విడిపోయిన తర్వాత అర్జున్ కపూర్‌కు దగ్గరైంది. వారిద్దరూ కలిసి 2017లో తొలిసారి లాక్మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా చెట్టాపట్టాల్ వేసుకొని కనిపించడంతో వారి డేటింగ్ వ్యవహారం మీడియాలో భగ్గుమన్నది. మలైకా 45వ బర్త్ డే సందర్భంగా వారిద్దరూ ఇటలీలో విహారయాత్ర చేయడంతో అర్జున్ కపూర్ డేటింగ్ వ్యవహారానికి అధికారిక ముద్ర పడింది.

Malaika Arora

2017 సంవత్సరం నుంచి మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఇద్దరూ పలుమార్లు వెకేషన్స్‌కు వెళ్లడం, అలాగే వారిద్దరూ ప్రేమ పక్షుల్లా తిరుగుతూ మీడియాలో హైలెట్ అవుతూ వస్తున్నారు. గతంలో వారిద్దరూ విడిపోయారని అనేక మార్లు రూమర్లు వచ్చాయి. కానీ ఆ వార్తలన్నీ రూమర్లుగానే మిగిలిపోయాయి.

Malaika Arora

అయితే తాజాగా మరోసారి అర్జున్ కపూర్, మలైకా అరోరా విడిపోయారనే వార్తలు గుప్పుమంటుండగా.. ఇన్స్‌టాగ్రామ్ పోస్టు వైరల్ అయింది. మలైకా పెట్టిన ఇన్స్‌టాగ్రామ్ పోస్టు పెట్టి.. గుడ్ మార్నింగ్.. మార్పు అనేది జీవితంలో ఒక సూత్రం. గతాన్ని, ప్రస్తుతాన్ని చూసే వారు ఫ్యూచర్‌ను మిస్ అవుతారు అంటూ నర్మగర్భంగా పోస్టు పెట్టింది.

Malaika Arora

దాంతో మలైకా పోస్టు వైరల్ కావడంతో అర్జున్ కపూర్‌తో రిలేషన్ బ్రేక్ అయిందనే వార్తలు ఊపందుకొన్నాయి. కానీ అటు మలైకా గానీ, అర్జున్ కపూర్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మలైకా, అర్జున్ కపూర్ విడిపోవడం కష్టమే. వారిద్దరూ మధ్య చిన్న తగాదాలు రావడం కామన్‌గా జరుగుతూనే ఉంటాయి అని సన్నిహితులు బ్రేకప్ వార్తను కొట్టిపడేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X