50 ఏళ్ల వయసులో తల్లైన గబ్బర్ సింగ్ భామ.. భర్తకు విడాకులిచ్చి.. ప్రియుడితో రెండో బిడ్డ!
దిల్ సే సినిమాతో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకే కాకుండా తెలుగు సినీ అభిమానులకు చేరువైన ముద్దుగమ్మ మలైకా అరోరా. ఆ తర్వాత గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక అనే పాటతో తెలుగు ప్రేక్షకులను, కుర్రకారును ఊర్రూతలూగించింది. అయితే సినీ నటిగా కాకుండా వివాదాలతోనే ఆమె సినీ అభిమానులకు చేరువైంది. అయితే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో రెండో బిడ్డకు జన్మనిచ్చినట్టు ఓ రూమర్ వైరల్ అవుతున్నది. ఆ వార్తలో నిజమెంత అనే వివరాల్లోకి వెళితే..
మలైకా అరోరా కెరీర్ పరంగా పీక్స్‌లో ఉండగానే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇంటికి కోడలిగా వెళ్లింది. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌తో పీకల్లోతు ప్రేమలో పడి పెళ్లి చేసుకొన్నది. 1998 సంవత్సరంలో వివాహం చేసుకొన్న ఈ గ్లామర్ హీరోయిన్.. 2017 వరకు దాంపత్య జీవితం కొనసాగించింది. దాదాపు 20 ఏళ్లు వైవాహిక జీవితం తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకొన్నారు.

అయితే విడాకుల తర్వాత కూడా సల్మాన్ కుటుంబంతోను అలాగే అర్బాజ్ ఖాన్‌తోను ఫ్రెండ్లీ రిలేషన్ కొనసాగిస్తున్నది. వారి ఇంట్లో జరిగే శుభకార్యాలకు తన కొడుకు అర్హాన్ ఖాన్‌తో కలిసి హాజరవుతుంటుంది. అయితే అర్బాజ్‌తో డైవోర్స్ తర్వాత 2016 నుంచి బాలీవుడ్ హీరో, బోని కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌తో సహజీవనం చేస్తున్నది.

మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఇద్దరు గత ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పలుమార్లు ఇద్దరు విడిపోయినట్టు, బ్రెకప్ చేసుకొన్నట్టు వార్తలు వచ్చినా.. అవి రూమార్లుగానే మారాయి. దాంతో వారిద్దరి బంధం బలమైనదని అభిమానులు పలు సందర్బాల్లో పేర్కొన్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో మరో బిడ్డకు తల్లి అయినట్టు వచ్చిన వార్త ఆశ్చర్యాన్ని కలిగించాయి.

అయితే వివాదాస్పద క్రిటిక్ ఉమేర్ సంధూ చేసిన ట్వీట్ అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఆయన ట్వీట్ చేస్తూ.. మలైకా అరోరా రెండోసారి తల్లి అయింది. ఆమె సరోగసి ద్వారా రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అర్జున్ కపూర్ వీర్య కణాల ద్వారా సంతాన్ని పొందారు అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
అయితే ఉమేర్ సంధూ చేసే ట్వీట్లనీ ఫేక్ అనే అభిప్రాయం ఉంది. మలైకా విషయం కూడా గాసిప్‌గానే అయి ఉంటుందనే అభిప్రాయం నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మలైకా, అర్జున్ కపూర్ రిలేషన్‌షిప్ మాత్రం అనేక రూమర్లకు ప్రాణం పోస్తున్నది.


Click it and Unblock the Notifications











