ప్రియుడితో స్టార్ హీరోయిన్ బ్రేకప్.. బాలీలో కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో శృంగారం!
బాలీవుడ్‌లో అఫైర్లు, రిలేషన్‌షిప్, బ్రేకప్ వార్లలు జోరుగా సాగుతున్నాయి. రోజుకో సెలబ్రిటీ వార్త తెరపైకి వస్తున్నది. అయితే అందులో వాస్తవం ఎంత? అవాస్తవం ఎంత అనేది తెల్చుకోవడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గత కొద్దికాలంగా మీడియాలో బ్రేకప్ జరిగిందనే వార్తలు మలైకా అరోరా, అర్జున్ కపూర్ గురించి వస్తున్నాయి. ఇలాంటి బ్రేకప్ వార్తల మధ్య తాజాగా బ్రేకింగ్ న్యూస్ అంటూ చేప్పిన విషయం ఆసక్తికరంగా మారింది. సెలబ్రిటీ కపుల్ బ్రేకప్ వివరాల్లోకి వెళితే..
దిల్ సే సినిమాలో ఛయ్యా.. ఛయ్యా అనే పాటతో దేశంలోని సినీ అభిమానులందరికి సుపరిచితులైన మలైకా అరోరా ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాలోని వైరల్ పాటతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. స్పెషల్ సాంగ్స్‌కు క్వీన్ ఇమేజ్ సాధించిన ఆమె సల్మాన్ సోదరుడు అర్బాన్ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకొన్నది.

అయితే దాదాపు 10 ఏళ్లకుపైగా దాంపత్య జీవితం గడిపిన తర్వాత విడాకులు తీసుకొన్నారు. 1998 సంవత్సరంలో వివాహం చేసుకొని..2002 సంవత్సరంలో ఓ కుమారుడు జన్మించిన తర్వాత ఆమె, అర్బాజ్ 2017లో విడిపోవడం అందర్నీ షాక్ గురి చేసింది. 2016 లోనే ఆమె అర్జున్ కపూర్‌కు దగ్గరైంది.
అర్జున్ కపూర్, మలైకా డేటింగ్, లివింగ్ రిలేషన్ షిప్ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వారి జీవితంపై కథలు కథలుగా కథనాలు వచ్చాయి. అయితే ఇప్పటికే పలుమార్లు వారిద్దరూ విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే వాటికి తెరదించుతూ మలైకా, అర్జున్ ఇద్దరు కలిసి మెలిసి కనిపించడంతో అవన్నీ గాలి వార్తలే అని నిరూపితమయ్యాయి.

అయితే గాసిప్స్ వార్తలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే ఉమేర్ సంధూ ఇటీవల ఓ ఘాటైన వార్తను పోస్టు చేశాడు. అర్జున్ కపూర్‌తో లివింగ్ రిలేషన్‌ను తెగ తెంపులు చేసుకొన్న తర్వాత ఆమె సెక్స్ హాలీడేస్ చేస్తున్నది. ప్రస్తుతం సంపన్నుడైన పారిశ్రామిక వేత్తతో కలిసి బాలీలో శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నది. 52 ఏళ్ల వయసులో హద్దులు మీరుతున్నది. పక్కా నాటీ అమ్మాయి అంటూ తన పోస్టులో వెల్లడించారు.
అయితే ఇలాంటి వార్తలను నమ్మవద్దని ఉమేర్ సంధూపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అయితే ఇలాంటి చెత్త వార్తలతో శునకానందం పొందుతాడు అని కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇలాంటి వార్తలు నమ్మోద్దు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు


Click it and Unblock the Notifications











