పూజా హెగ్డే అవుట్.. స్టార్ హీరోతో రొమాన్స్‌కు మమితా బైజు!
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వెంట పరుగులు పెడుతారనే విషయం అందరికి తెలిసిందే. విజయాలే ఎవరికైనా అవకాశాలు తెచ్చిపెడుతాయి. పరాజయాలు ఆర్టిస్టులను, సాంకేతిక నిపుణులను వెనక్కి నెడుతాయి. చేతిలోకి వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఇలాంటి సందర్భాలు సినిమా పరిశ్రమలో ఎన్నో చూశాం. ఒక రోజు సక్సెస్‌తో స్టార్‌గా నిలబడిన వారు.. ఒకట్రెండు ఫ్లాప్ రాగానే ఆఫర్లు చేజారిపోతాయి. అలాంటి పరిస్థితే ప్రస్తుతం పూజా హెగ్డేకు ఎదురైంది. ఆమెను నుంచి చేజారిన ఆఫర్ గురించిన వివరాల్లోకి వెళితే..
గతంలో పూజా హెగ్డే వరుస హిట్లతో దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకొనే హీరోయిన్లతో ఒకరిగా నిలిచింది. అందం, అభినయంతో ఆకట్టుకొనే పాత్రల్లో నటింి మెప్పించింది. అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, హౌస్‌ఫుల్ 4, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో వరుస సక్సెస్‌తో ఆమె కెరీర్ సాగిపోయింది.

అయితే స్టార్‌గా టాప్ రేంజ్‌లోకి చేరుకొన్న ఆమె కెరీర్ ఒక్కసారిగా రివర్స్ అయింది. రాధే శ్యామ్ , బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసి కా భాయ్, కిసి కీ జాన్, దేవా, రెట్రో సినిమాలు వరుసుగా ఫ్లాప్ అయ్యాయి. ఇటీవల ఆమె ఎన్నో ఆశలు పెట్టుకొని డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటించిన రెట్రో కూడా అభిమానులకు నిరాశను మిగిల్చింది. దాంతో ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయనే మాట సినీ వర్గాలో ఉంది.
అయితే తాజాగా ధనుష్ నటించే సినిమాలో ముందుగా పూజా హెగ్డేను అనుకొన్నారు. దర్శకుడు విగ్నేష్ రాజా కూడా ఆమెను తీసుకోవాలని భావించారు. కానీ అనుకోకుండా ఆ సినిమాలో హీరోయిన్ మారిపోయింది. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డేను తప్పించి.. ఆమె స్థానంల ప్రేమలు హీరోయిన్ మమితా బైజును తీసుకొన్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ విషయం కోలీవుడ్‌లో భారీ చర్చకు దారి తీసింది. అయితే మమితా బైజును మాత్రం ధనుష్ పక్కన నటించే అదృష్టం వరించింది అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తున్నది.
అయితే ధనుష్‌తో అవకాశం చేజారినా.. పూజా హెగ్డేకు మాత్రం ఇంకా చేతి నిండా ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో స్పెషల్ రోల్‌లో కనిపించబోతున్నారు. అలాగే దళపతి విజయ్ నటించే జన నాయగన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీలోను, అలాగే కాంచన 4 చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
ధనుష్ కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా కుబేరా సినిమాతో భారీ హిట్‌ను సొంతం చేసుకొన్నారు. తాజాగా ఇడ్లీ కడై అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా అక్టోబర్‌లో రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఇక మమితా బైజు విషయానికి వస్తే.. ప్రస్తుతం దళపతి విజయ్‌తో జన నాయకన్, ప్రదీప్ రంగనాథన్‌తో డ్యూడ్ సినిమాలో నటిస్తున్నారు. ఇంకా సూర్యతో ఓ సినిమా బెత్తేహమ్ కుడుంబా యూనిట్ అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











