Kannappa Loss : రిలీజ్ కు ముందే కన్నప్పకు 100 కోట్ల నష్టం.. బయట పెట్టిన స్టార్ నటుడు
మంచు ఫ్యామిలీలో తొలిసారిగా భారీ బడ్జెట్ తో కన్నప్ప చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియాలో పాన్ ఇండియా చిత్రాలు రూపుదిద్దుకుంటున్న వేళ టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా అదే స్థాయిలో కన్నప్పను నిర్మించారు. ఆయనే నిర్మాతగా వ్యవహరించి AVA ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లలో రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించారు. చిత్రాన్ని జూన్ 27న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేశారు. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వసూళ్లను రాబడుతోంది. అయితే ఈ చిత్రం రిలీజ్ కు ముందే 100 కోట్ల రూపాయలను నష్టపోయిందనే టాక్ కొత్తగా ప్రచారంలోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
కన్నప్ప చిత్రం రన్ టైమ్..
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమా ప్రేక్షకులను ఒకింత ఆకట్టుకుంది. భారీ విజువల్స్, హిందూ పురాణం ఆధారంగా, భక్త కన్నప్ప నిజ జీవిత చరిత్ర ద్వారా ఈ సినిమాను రూపొందించారు. ఆధ్యాత్మిక చిత్రం కావడంతో సహజంగానే ఎక్కువ పాత్రలు నటించాల్సి ఉంటుంది. దీంతో ప్రతి పాత్ర గురించిన ప్రాధాన్యతను చెప్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కన్నప్ప చిత్రం షూటింగ్ సమయంలో ప్రతి పాత్రకు సంబంధించిన సన్నివేశాలను డిటైల్ గా చిత్రీకరించారు. దీంతో రఫ్ కట్ 4 గంటల 30 నిమిషాల వరకు ఫుటేజీ వచ్చిందంట. అందులో నుంచి ట్రిప్ చేసి 3 గంటల 15 నిమిషాలకు తీసుకొచ్చారు. అయితే మిగిలినా 1 గంట 15 నిమిషాల నిడివిని తొలగించారు.

ఆ పొరపాటుతో 100 కోట్లు నష్టం?
సాధారణంగా ఎలాంటి సినిమాకైనా కొంత ఫుటేజీ వేస్ట్ అవుతూ ఉంటుంది. ఎడిటింగ్ లో సమస్యలు ఉండొద్దు అని ముందుగానే కొన్ని ఎక్ట్ర్సా షార్ట్స్ ను తీస్తూ ఉంటారు. అయితే అది మహా అంటే 10 నిమిషాల నుంచి 30 నిమిషాల మధ్యలోనే వేస్టేజీ ఉంటుంది. కానీ పూర్తిగా సీన్లనే లేపేసే సాహసం చేయరు. అయితే కన్నప్ప విషయంలో 1 గంట 15 నిమిషాల సీన్లనే తీసేశారంట. ఆ ఫుటేజీ వాల్యూ రూ.100 కోట్లు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ చిత్రంలో నటించిన బిగ్ బాస్ విన్నర్ కౌషల్ మంద ఈ విషయాన్ని చెప్పడం హాట్ టాపిక్ గ్గా మారింది.
ఇప్పటి వరకు కన్నప్ప భాక్సాఫీస్ కలెక్షన్స్..
మొదటి వారం కన్నప్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. కానీ 2వ వారంలో డీలా పడిపోయింది. తాజాగా 10వ రోజు ఈ చిత్రానికి రూ.68 లక్షల ఇండియా నెట్ అందింది. అంటే 1 కోటీ రూపాయల వరకు గ్రాస్ వసూల్ చేసింది. ఇక ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా టోటల్ రూ.43 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నారు.
భారీ తారాగణం నటించినా..
కన్నప చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ కాస్ట్ నటించినా సినిమాకు కలెక్షన్లు అందడం లేదు. ఓపెనింగ్ మాత్రం అదిరిపోయింది. రానురానూ వసూళ్లు క్షీణిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి హిందీ మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించడం విశేషం.


Click it and Unblock the Notifications











