Pushpa Item Song: 60 ఏళ్ల అందాల భామతో ఐటెం సాంగ్.. ! బన్నీ- సుక్కుల అరాచకం మాములుగా లేదుగా !
Pushpa Item Song: కామన్ గా ఐటెం సాంగ్ అంటేనే హాట్ బ్యూటీస్ అందాల ఆరబోత. నాటుకోడి కూరలా ఘాటుగా ఉండే గ్లామర్స్ సాంగ్స్ కోసం మాస్ ఆడియన్స్ తహతహలాడుతారు. అందులోనూ ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ - సక్సెస్ పుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కే మూవీ అంటే.. మాస్ ఆడియన్స్ కు పండుగే. వారి కాంబినేషన్ లో ఐటెం సాంగ్ అంటే.. పూనకాలే.. ఇక రచ్చ రంబోలనే.. తాజాగా పుష్ప 2.. ద రూల్ సినిమాలోని ఐటమ్ సాంగ్ కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.
గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీ పుష్ప. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమా తెలుగులో కన్నా నార్త్ బెల్ట్ లో రికార్డు కలెక్షన్స్ వసూల్ చేసింది. తాజాగా ఆ బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప సిక్వెల్ గా పుష్ప -2 పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ కీ రోల్ లో నటిస్తున్నారు. ఈ మూవీ మొదటి భాగం కంటే.. రెండో భాగం మరింత పెద్దదిగా ఉండట, ఇండియా వైడ్ ప్రేక్షకులందరూ ఆకట్టుకునేలా తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమా ఈ ఏడాది చివరి నెలలో డిసెంబర్ 6న వరల్ట్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే.. పుష్ప 2.. ద రూల్ సినిమాలో ఐటమ్ సాంగ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

బన్నీ- సుక్కు కాంబినేషన్ లో ఐటెం సాంగ్ కు ఓ స్పెషల్ మార్క్. వారి సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి యంగ్ అండ్ హాట్ స్టార్ హీరోయిన్‌లు సైతం ఇంట్రెస్ట్ చూపుతారు. కానీ.. ఈ సినిమాలోని ఐటెం సాంగ్ ఓ 60 ఏళ్ల సీనియర్ హీరోయిన్ రెడీగా ఉందట.
ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరని ఆలోచిస్తున్నారా..? ఆమెనే మీనాక్షీ శేషాద్రి. ఆపద్భాందవుడు సినిమాలో చిరంజీవి సరసన నటించి.. తెలుగు వారికి చేరువైన నటి మీనాక్షి శేషాద్రి. ఆమె టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో ఎన్నో హిట్ మూవీలో నటించి మెప్పించింది. ఈ ఆరు పదుల సుందరీ ఓ దశాబ్దం కాలం ఇండస్ట్రీకి దూరమైనది. ఈ సీనియర్ నటి 60 ఏళ్ల వయసులో రీ ఏంట్రీకి సిద్దమైందట.. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఐటెం సాంగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి అందరి ద్రుష్టిని ఆకర్షించింది. ఇరవై ఏళ్లలో ఐటెం సాంగ్ ఎవరైనా చేస్తారు. కానీ తాను 60 ఏళ్లలో హాట్ సాంగ్ కు స్టెప్పులేసి ఆ రూల్ ను బ్రేక్ చేస్తానని చెప్పుకొచ్చింది. ఈ షాకింగ్ కామెంట్స్ వైరల్ కావడంతో డైరెక్టర్ సుకుమార్.. ఈ 60 ఏళ్ల భామకు పుష్ప 3లోని ఐటెం సాంగ్ లో అవకాశం ఇవ్వస్తారేమో అని టాక్ వస్తుంది.

90 ల నాటి స్టార్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి కే నటి మాత్రమే కాదు.. ఆమెకు భరతనాట్యం, కథక్, ఒడస్సీ డాన్స్ ల్లో ప్రవీణ్యం ఉంది. పలుమార్లు ప్రదర్శనలు కూడా ఇచ్చింది. అలాగే.. పలు డ్యాన్స్ రియాలిటీ టీవీ షోలలో ఆమె జడ్జీగా కూడా వ్యవహరిస్తున్నారు. మీనాక్షి శేషాద్రి మేరా జవాబ్, మహాశక్తిమాన్, లవర్ బాయ్, మా బేటీ, స్వాతి, పరివార్, సత్యమేవ జయతే, విజయ్, దామిని వంటి చిత్రాల్లో ఆమె నటించారు. 1991లో తెరకెక్కిన 'బ్రహ్మశ్రీ విశ్వామిత్ర'తో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఏడాది చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'ఆపద్బాంధవుడు'లో నటించి తెలుగువారి ప్రేమను పొందారు. 2016లో విడుదలైన 'గాయల్ వన్స్ అగైన్'లో అతిథి పాత్రలో కనిపించారు.


Click it and Unblock the Notifications











