పుష్ప 2ని తొక్కేయడానికి మెగా కుట్ర? .. ఎలా ఫ్లాప్ చేయాలో ఫ్యాన్స్‌కి ఐడియాలు?
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. అయితే పుష్ప 2ని అడ్డుకోవడానికి, ఉద్దేశపూర్వకంగా ఫ్లాప్ చేయడానికి తెరవెనుక కుట్రలు జరుగుతున్నాయని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళ్తోంది.
అన్ని రకాల అవాంతరాలు, అడ్డంకులను అధిగమించి పుష్ప 2 షూటింగ్ ప్యాచ్ వర్క్ సహా మొత్తం పూర్తి చేసుకుంది. హీరో అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ వర్క్‌ను ఫినిష్ చేసిన చిత్ర యూనిట్ ఇటీవల షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేసింది. ఓవర్సీస్‌లో ఒక రోజు ముందే అంటే డిసెంబర్ 4వ తేదీనే పుష్ప 2 సందడి మొదలుకానుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు ఉండనున్నాయి. ఈ మూవీపై ఉన్న అంచనాల దృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో పుష్ప 2 స్పెషల్ షో వేయగా.. సినిమా చూసిన అల్లు అర్జున్, సుకుమార్, అల్లు అరవింద్ ఎగ్జయిటింగ్‌కు గురైందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వగా.. పుష్ప2 రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివి ఉంది. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చిలలో మూవీ ఈవెంట్స్ జరగ్గా.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇదే ఈవెంట్‌లో పుష్ప 2 సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ మరింత పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు.
అయితే పుష్ప మేకర్స్‌ని ఓ విషయం భయపెడుతోంది. అదే మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధికి అల్లు అర్జున్ మద్ధతు పలకడంతో పాటు తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు రెండు కుటుంబాల మధ్య గ్యాప్ తీసుకొచ్చినట్లుగా ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. నాగబాబు ట్వీట్‌తో పాటు బన్నీ, స్నేహారెడ్డిలను సోషల్ మీడియాలో సాయితేజ్ బ్లాక్ చేయడం తదితర పరిణామాలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్‌కి టార్గెట్ అయ్యారు. దీంతో వారికి భయపడి ఆగస్ట్ 15న రిలీజ్ కావాల్సిన పుష్ప2ని డిసెంబర్ 5కు వాయిదా వేసినట్లుగా పుకార్లు హల్ చల్ చేశాయి.

ప్రస్తుతం ఎన్నో భారీ అంచనాల మధ్య వస్తున్న పుష్ప 2ను కొందరు ఫ్లాప్ చేయాలని , నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలని చూస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొందరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న ఆడియో క్లిప్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో మేకర్స్ ఉలిక్కిపడ్డారు. అందులో ఏముందంటే.. వీపీఎన్ ద్వారా సినిమాను లైవ్ స్ట్రీమింగ్ చేయడంతో పాటు సినిమా బాలేదని రివ్యూలు చెప్పడం వంటివి చేస్తానని ఓ వ్యక్తి గొంతు వినిపించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అల్లు ఆర్మీ రంగంలోకి దిగి మెగా ఫ్యాన్స్‌పై విరుచుకుపడుతోంది. మరి నిజంగా పుష్ప 2ని ఫ్లాప్ చేసేందుకు కుట్ర జరుగుతుందా? ఆ ఆడియో క్లిప్‌లో మాట్లాడుకున్నది ఎవరు? అనే అంశాలు చర్చనీయాంశమయ్యాయి.


Click it and Unblock the Notifications











