మంచు ఇంట్లో ఫైర్ .. కొడుకుని మోహన్ బాబే కొట్టించారా? అందులో నిజమెంత?
ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులుకి సంబంధించి కొన్ని కాంట్రవర్సీలు ఓ రేంజ్‌లో ఒక్కొక్కటిగా బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా వీటి అన్నిటిలో ఇపుడు లేటెస్ట్‌గా ఎవ్వరూ ఊహించని రీతిలో సంచలనం రేపిన అంశం ఏదన్నా ఉంది అంటే అది మంచు వారి కుటుంబ గొడవలు అని చెప్పాలి. కాగా మంచు ఫ్యామిలీ అంటే మన తెలుగు సినిమాలో ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉంది.
మంచి ఎంటర్టైన్మెంట్ వీరి నుంచి వస్తుంది అనే టాక్ ఉంటుంది. అలాగే పలు ట్రోల్స్ కూడా ఉంటాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా మోహన్ బాబు అండ్ మంచు విష్ణులు అయితే తమ రేంజ్ ఏంటో చూపించారు. వీటి నేపథ్యంలోనే ఎప్పుడూ సైలెంట్ గా ఉండే మంచు మనోజ్ విషయంలో మాత్రం పలు ఘటనలు షాకింగ్ గా మారాయి. మనోజ్ , మోహన్ బాబులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో రగడ బయటకి వచ్చింది.

ఈ నేపథ్యంలో నిన్ననే మంచు మనోజ్ చేసిన పలు సంచలన ఆరోపణలు .. మధ్యలో మంచు విష్ణు ఎంట్రీ మరింత మసాలా జోడించాయి. ఇంకోపక్క మోహన్ బాబు ఈ గొడవలు జరుగుతుంటే పట్టనట్టుగా పలు సినిమా పోస్ట్ లు పెట్టుకుంటూ వచ్చారు. అయితే అసలు దీనికి మొదలు ఎక్కడ అనేది ఆసక్తిగా మారగా గత కొన్నాళ్ల నుంచి మంచు మనోజ్.. మోహన్ బాబు కుటుంబంతో అంత సఖ్యతగా లేడు అని వార్తలు వస్తున్నాయి. అందుకే మోహన్ బాబు అండ్ విష్ణులు అతనిని మందలించడం కూడా జరిగింది అంటూ పలు పుకార్లు వచ్చాయి.
కాగా ఇవి కాకుండా మోహన్ బాబు మంచు మనోజ్ ని తన బౌన్సర్ల చేత కొట్టించారు అంటూ ఓ షాకింగ్ వీడియో ఇటీవల బయటకి వచ్చి అయ్యింది. మోహన్ బాబు నివాసం చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఆ ఇంటి బయట ఏం జరుగుతుందో రికార్డు చేశారు. ఇందులో మోహన్ బాబు స్టైల్ గా కూర్చిలో కూర్చొని ఉంటే తన ఎదురుగా తన బౌన్సర్లు ఎవరో ఒక వ్యక్తిని చెంప మీద దెబ్బలు కొడుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి.
దీనితో అది మంచు మనోజే అని ఇక్కడ నుంచే ఇదంతా వెలుగులోకి వచ్చింది అని టాక్ బయటకి వచ్చింది. కానీ ఆ పర్సనాలిటీ చూస్తే డెఫినెట్ గా మంచు మనోజ్ లా అయితే లేదు. దీంతో మంచు వారి కుటుంబంలో అసలేం జరుగుతుంది అనేది మరింత సస్పెన్స్ గా మారింది. ఓ పక్క మనోజ్ ఏమో నాకు ఆస్తులు ముఖ్యం కాదు ఆత్మ గౌరవం ముఖ్యం అంటున్నాడు. కానీ మోహన్ బాబు ఏమో అందరి కన్నా నిన్నే బాగా చూసుకుంటే నువ్వేమో నన్ను గుండెల మీద తన్నావు అంటూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఇలా మంచు కుటుంబంలో మాత్రం ఓ రేంజ్ లో రచ్చ పీక్స్ లోకి వెళుతుంది.


Click it and Unblock the Notifications











