బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురితో మోక్షజ్ఞ రొమాన్స్..శ్రీదేవి కుమార్తెను రిజెక్ట్ చేశారా?
టాలీవుడ్ సినిమా దగ్గర తరాలు మారుతున్నా కొద్దీ తారల నుంచి తమ నట వారసత్వాన్ని యువ హీరోలు ముందుకు తీసుకెళుతున్నారు. అలా మన తెలుగు సినిమా దగ్గర ఉన్న టాప్ మోస్ట్ ఫ్యామిలీ లలో మెగా కుటుంబం, అక్కినేని కుటుంబం అలాగే ఘట్టమనేని కుటుంబం నుంచి వారసులు ఉన్నారు.
అలాగే నందమూరి కుటుంబం నుంచి కూడా చాలా మంది ఉన్నాఋ. కానీ ఎప్పుడు నుంచో నందమూరి కుటుంబం నుంచి ఓ యువ హీరో ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. మరి ఆ హీరో ఎంట్రీ ఎవరో కూడా కాదు నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తేజ కోసమే అని చెప్పొచ్చు. దాదాపు సింహా సినిమా సమయం నుంచి తెలుగు సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తూ వచ్చారు.

అలా ఇన్నేళ్ల నిరీక్షణలో మొత్తానికి ఈ 2024లో ఇచ్చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఓ రేంజ్ లో యువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో లాక్ చేసేసారు. కాగా ఇదంతా బాగానే ఉంది. కానీ అసలు తన సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది.
అయితే ఆ మధ్య అలనాటి నటి శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ తో మోక్షజ్ఞ రొమాన్స్ చేయనున్నాడు అని పలు గాసిప్స్ వచ్చాయి. అలాగే ఈమె ఎంట్రీ కూడా ఈ సినిమా తోనే వస్తుంది అని టాక్ వచ్చింది. కాగా ఈ సినిమా పై ఇప్పుడు మరో రూమర్ అయితే వినిపిస్తుంది. దీనితో శ్రీదేవి కూతురు కాదు కానీ మరో బాలీవుడ్ కి చెందిన సీనియర్ బ్యూటీ వారసురాలుతో మోక్షజ్ఞ రొమాన్స్ చేయనున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఐతే ఆమె ఎవరో కూడా కాదట ఒకప్పుడు బాలీవుడ్ ని సౌత్ ని తన అందంతో అలరించిన నటి ఇటీవల KGF పార్ట్ 2 లో యష్ ని ఎదిరించే పవర్ఫుల్ రోల్ లో కనిపించిన రవీనా టాండన్ కూతురుతో అట. కాగా రవీనా కూతురు రాషా తదాని అయితే బాలయ్య వారసుడి సరసన లాక్ అయ్యినట్టుగా గట్టి రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ క్రేజీ కలయిక దాదాపు ఖాయమే అన్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇలా ప్రస్తుతం మాత్రం వీరిద్దరి కాంబినేషన్ పై సినీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. కాగా ఈమెకి కూడా తెలుగులో ఇదే మొదటి సినిమా చేయనుంది అని వినిపిస్తుంది. మరి చూడాలి ఈ యంగ్ హీరోయిన్ ఎంట్రీ నందమూరి వారసునితోనే ఉంటుందో లేదో అనేది.

కాగా రవీనా అయితే ఉపేంద్ర, కమల్ హాసన్ లాంటి స్టార్స్ సరసన అప్పట్లో నటించింది. మళ్ళీ సౌత్ లో KGF 2 తో అయితే ఒక్కసారిగా షైన్ అయ్యింది. ఇక మోక్షజ్ఞ సినిమాని దర్శకుడు ప్రశాంత్ వర్మ భారీ బడ్జెట్ తో తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిస్తుండగా ఇందులో మోక్షజ్ఞని సూపర్ హీరోగా పరిచయం చేయనున్నట్టుగా తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











