అల్లు అర్జున్, సుకుమార్ వివాదం?..పుష్ప 2 మూవీపై ఆగని రూమర్లు
ఇండియన్ సినిమా దగ్గర సీక్వెల్ సినిమాలకి ఏ రేంజ్ ఎగ్జైటింగ్ వాతావరణం ఏర్పడుతుందో చూస్తూనే ఉన్నాం. ఇక పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చి ఇంకో సినిమాకి లీడ్ ఇచ్చి వదిలితే అన్ని సినిమాలు కాకపోయినా కొన్ని సినిమాలు డెఫినెట్ గా చూస్తారని ప్రూవ్ అయ్యింది. అయితే ఈ చిత్రాల్లో బెంచ్ మార్క్ సీక్వెల్ చిత్రాలుగా నిలిచిన వాటిలో మన సౌత్ నుంచి వచ్చిన బాహుబలి 2 ఇంకా కేజీయఫ్ 2 సినిమాలు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాయి.
కాగా వీటి తర్వాత మళ్ళీ పాన్ ఇండియా ఆడియెన్స్ అంతా ఎదురు చూస్తున్న రిమార్కబుల్ సీక్వెల్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ట్రూ పాన్ ఇండియా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సీక్వెల్ చిత్రం "పుష్ప 2 ది రూల్" మాత్రమే నిలిచి ఉందని చెప్పాలి. కాగా ఈ భారీ సినిమాని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా పార్ట్ 1 ఊహించని హిట్ అవ్వడంతో పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

కాగా దీనితో పార్ట్ 2 విషయంలో ప్రెజర్ ఉండడం అనేది చాలా సహజం అయితే ఇది అంతర్గతంగా ఉహించని మార్పులు చేర్పులు తీసుకొచ్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. నిజానికి పుష్ప 2 అలాగే పార్ట్ 3 కూడా ప్లాన్ లు సుకుమార్ వేసుకున్నాడు కానీ కొన్ని కారణాలు చేత తాను అనుకున్న కథని టోటల్ గా భారీ మొత్తంలో మార్చేసినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్, సుకుమార్ మధ్య గొడవలు జరిగాయని మరింత వివాదంగా మారింది అందుకే ఈ సినిమా మరింత ఆలస్యం అవుతూ వస్తుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా అప్పటికప్పుడు జరుగుతున్నా మార్పులు చేర్పులు మూలాన యూనిట్ లో కూడా కాస్త గందరగోళం ఏర్పడుతుంది అని అందుకే సినిమా ఇన్ని మార్లు ఆలస్యం అవుతూ వస్తుంది అని మరో టాక్. ఇక వీటితో పాటుగా మరోసారి పుష్ప 2 వాయిదా అంటూ పలు పుకార్లు మొదలయ్యాయి. అయితే ఆగస్ట్ నుంచి డిసెంబర్ కి వాయిదా వేసినప్పటికీ సినిమాకి అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం పట్టేలా ఉందని అందుకే ఏకంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలకి సినిమా షిఫ్ట్ అయ్యిపోయింది అంటూ కొత్త గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఇక దీనితో పాటుగా ఈ సినిమాతో మేకర్స్ సోలో హిట్ కొట్టాలని అందుకే ఎలాంటి గట్టి పోటీ లేకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుగా అందుకే ఏప్రిల్ కి షిఫ్ట్ చేసేశారని మరో వెర్షన్ కూడా వినిపిస్తుంది. కాగా పుష్ప 2 ఆల్రెడీ డిసెంబర్ రిలీజ్ ని అనౌన్స్ చేసినప్పటికీ పలు పాన్ ఇండియా చిత్రాలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ "గేమ్ చేంజర్", మంచు హీరో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ "కన్నప్ప" లాంటి సినిమాలు కూడా ఉన్నాయి.

వీటితో పుష్ప 2 కి బాక్సాఫీస్ దగ్గర మరింత గట్టి పోటీ వాతావరణం కనిపిస్తుంది. దీనితో రెవెన్యూస్ పరంగా కూడా ఆలోచించి సినిమా వచ్చే ఏడాదికి మార్చినట్టుగా వినికిడి. మరి ఈ అన్నిటిలో ఎంతవరకు నిజం ఉందొ కానీ నార్త్ సినీ ట్రాకర్స్ కూడా పుష్ప 2 వచ్చే ఏడాది ఏప్రిల్ రిలీజ్ అంటూనే ప్రచారం చేస్తున్నారు. కాగా వీటిపై నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా అనసూయ, సునీల్ తదితరులు నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఆల్రెడీ తన నుంచి వచ్చిన రెండు పాటలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











