తెలుగులో భారీ ఆఫర్ వదులుకున్న మృణాల్ ఠాకూర్? టాప్ స్టార్‌తో రొమాన్స్‌ మిస్?

తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయమైన కొద్ది సమయంలోనే కొందరు హీరోలు లేదా హీరోయిన్స్ వెంటనే మంచి అటెన్షన్ ని తెచ్చుకుంటారు. అయితే హిందీ ఇండస్ట్రీ నుంచి మన దగ్గరకి వచ్చి సెటిల్ అయ్యిన బాలీవుడ్ భామలు చాలా మంది ఉన్నారు. ఈ కొన్నేళ్లలో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తెలుగు ఆడియెన్స్‌లో బాగా ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది టాలెంటెడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అని చెప్పాలి.

కాగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా హిందీ ఇండస్ట్రీలో పరిచయం అయినప్పటికీ అక్కడ ఆమెకి డిజాస్టర్ ఓపెనింగ్ మాత్రమే దక్కింది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంటర్ కావడంతోనే భారీ హిట్‌ని సొంతం చేసుకొని ఒక్క సినిమాతోనే తెలుగులో బాగా పాపులర్ అయ్యింది. ఇలా తెలుగులో హీరోయిన్ గా మొత్తం మూడు సినిమాలు అలాగే సహాయ నటిగా నటించి మంచి డిమాండ్ ఉన్న నటిగానూ మారింది.

is mrunal lost a big offer in telugu here is some clarity

ఇలా తెలుగులో మంచి మార్క్ వేసిన మృణాల్.. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ది ఫ్యామిలీ స్టార్ ప్లాప్‌తో మాత్రం కొంచెం డీలా పడింది. ఆ సినిమా హిట్ కొడితే హ్యాట్రిక్ ఎంజాయ్ చేద్దాం అనుకుంది కానీ ఈ సినిమా దెబ్బ కొట్టేసరికి మృణాల్ మళ్ళీ హిందీ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది అని టాక్ వచ్చింది.

కానీ కొన్నాళ్ల క్రితమే మృణాల్ హీరోయిన్ గా తెలుగులో ఓ సినిమా చేస్తున్నట్టుగా హింట్ ఇచ్చింది. ఇది ఎవరితోనో కాదు ఏకంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో అనే టాక్ మొదలైంది. మొదటిగా దర్శకుడు హను రాఘవపూడి (మృణాల్ ని సీతారామం తో పరిచయం చేసిన దర్శకుడు) ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమాకి ఓకే అయ్యింది అని టాక్ వచ్చింది. కానీ వాటిని అప్పుడే మృణాల్ కొట్టి పారేసింది.

is mrunal lost a big offer in telugu here is some clarity

ఇక ఈ సినిమా కాకుండా మరో భారీ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో సినిమాలో ఛాన్స్ కొట్టిసినట్లుగా వార్తలు రావడంతో అది కాస్తా వైరల్ గా మారింది. అయితే ఈ ఆఫర్‌ని కూడా మృణాల్ వదులుకున్నట్టుగా ఇపుడు సినీ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రభాస్‌తో సందీప్ తీస్తోన్న స్పిరిట్ సినిమాలో కీలక పాత్ర లేదా హీరోయిన్ గా ఆమెని అనుకున్నట్టుగా వార్తలు రాగా ఇపుడు ఫైనల్‌గా ఇవన్నీ అద్దం అని తెలుస్తోంది.

దీనితో ఈ బిగ్ ఆఫర్‌ని మృణాల్ వదులుకుందా లేదా అసలు ఆమెకి ఆఫర్ రానే లేదా అనేది మాత్రం కొంచెం సస్పెన్స్ గానే ఉంది. మరి ఇది అబద్దం అయితే ఇది కాకుండానే మరో సినిమాని తెలుగులో మృణాల్ ఓకే చేసినట్టు అనుకోవాలి. మొత్తానికి మాత్రం మృణాల్ తెలుగులో ఏ సినిమా చేస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఈ హాట్ అండ్ హోమ్లీ బ్యూటీ తెలుగులో నెక్స్ట్ చేయబోయే సినిమా ఏంటో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: mrunal thakur vijay devarakonda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X