ధనుష్ తో డేటింగ్ ను కన్ఫమ్ చేసిన మృణాల్ ఠాకూర్.. ఇదే సాక్ష్యమంటూ..!
స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మరాఠి చిత్రాలు, సిరీయల్స్ తో మొదలైన తన కెరీర్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో కొనసాగుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ చిత్రాల్లో మంచి ఆఫర్లు అందుకుంటోంది. ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ ప్రముఖ కోలీవుడ్ హీరో ధనుష్ తో డేటింగ్ అంటూ వార్తలు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం నార్త్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వీరి రిలేషన్ షిప్ పై విపరీతమై ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
ధనుష్ డివోర్స్..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పటికే డివోర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తో ధనుష్ కు మొదటి వివాహం జరింది. 18 ఏళ్లు అన్యోన్యంగా జీవించిన వారు 2022లో విడిపోయారు. 2024లో డివోర్స్ ప్రకటించి షాక్ ఇచ్చారు. అసలు వీళ్లిద్దరు ఎందుకు విడిపోయారనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఆ తర్వాత నుంచి కేవలం పిల్లలకు కో పేరెంటింగ్ గా మాత్రమే ఉంటున్నారు. తమ తమ జీవితాల్లో సింగిల్ లానే లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.

మృణాల్ ఠాకూర్ తో డేటింగ్..
ధనుష్ డివోర్స్ తర్వాత అభిమానులు, సినీ ప్రముఖుల చాలా విచారం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు కలిసి ఉన్న వీరు ఎందుకు వీడిపోయారని సందేహాలతో ఉన్నారు. ఇక ఈ క్రమంలో ధనుష్ మృణాల్ ఠాకూర్ తో డేటింగ్ లో ఉన్నారని ఇటీవల ప్రచారం జరుగుతోంది. మృణాల్ ఠాకూర్ ధనుష్ తో ఎంతో క్లోజ్ గా మూవ్ అవుతోందని ఇండస్ట్రీలోనూ గట్టి టాక్ వినిపిస్తోంది. పైగా ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ధనుష్ తో డేటింగ్ కన్ఫమ్ అంటూ ఓ వార్తను వైరల్ గా మారింది.
మృణాల్ ఠాకూర్ ధనుష్ డేటింగ్ ను కన్ఫమ్ చేసే ఆధారం ఆమె ధనుష్ ఇద్దరు అక్కాచెళ్లలను సోషల్ మీడియాలో అవుతుండటమే అని అంటున్నారు. ఇప్పటికే ఊహాగానాలు పుట్టుకొస్తున్న వేళ మృణాల్ ఠాకూర్ ధనుష్ సోదరిమణులు డాక్టర్ కార్తీకా కార్తీక్, విమల గీతాలను సోషల్ మీడియాలో ఫాలో అవుతుండటం ఆసక్తికరంగా మారింది. దీంతో మృణాల్ ఠాకూర్ ధనుష్ కుటుంబానికి ఎంతో దగ్గరగానూ ఉంటోందని చెప్పుకుంటున్నారు. ఇక ధనుష్ ప్రతి సినిమా అప్డేట్ ను తను ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తూ వస్తుండటం విశేషం.
ఇక మృణాల్ ఠాకూర్ రీసెంట్ ఫిల్స్మ్ మా, సన్నాఫ్ సర్దార్ 2 చిత్రాల స్క్రీనింగ్ కు ధనుష్ ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. మృణాల్ ఠాకూర్ గెస్ట్ లిస్ట్ లో ధనుష్ పేరు ఉండటంతో రూమర్లు మరింత బలపడ్డాయి. దీంతో మృణాల్ ఠాకూర్ ధనుష్ డేటింగ్ కన్ఫమ్ అని అంటున్నారు. ఇక కుటుంబ సభ్యుల గురించి కూడా వీరి రిలేషన్ గురించి తెలిసి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా ప్రకటించేందుకు ధనుష్, మృణాల్ ఠాకూర్ సుముఖంగా లేరని వారికి దగ్గరి వ్యక్తులు చెబుతుండటం విశేషం.


Click it and Unblock the Notifications











