ప్రియుడి డైరెక్షన్‌లో మృణాల్ థాకూర్..తమిళంలో గ్రాండ్ ఎంట్రీకి ప్లాన్

తెలుగు సినిమా పరిశ్రమలో వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. ఆమె నటించిన చిత్రాలు సూపర్ హిట్ అవుతున్నప్పటికీ చాలా తక్కువగా నటిస్తున్నారు. పెర్ఫార్మెన్స్ ప్రాధాన్యం ఉన్న పాత్రలతోనే ముందుకెళ్తున్నారు. సీతారామం, హాయ్ నాన్న చిత్రంతో తెలుగు అమ్మాయిగా మారిన ఈ ముద్దుగమ్మ అటు హిందీ, తెలుగు భాషల్లో తనకంటూ ఇమేజ్ తెచ్చుకొన్నది. అయితే ప్రస్తుతం కెరీర్‌తోపాటు అఫైర్ రూమర్లతో మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా ఈ బ్యూటీ గురించిన ఓ వార్త దక్షిణాది మీడియాలో వైరల్ అవుతున్నది. ఇంతకు మృణాల్ గురించి ట్రెండ్ అవుతున్న వార్త వివరాల్లోకి వెళితే..

మృణాల్ థాకూర్ కెరీర్ పరంగా గట్టి జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఆఫర్లు భారీగా వచ్చిన తొందరపాటు చూపకుండా తన కెరీర్‌కు బాగా హెల్ప్ అయ్యే పాత్రలనే ఎంపిక చేసుకొంటున్నారనే విషయం మరోసారి డెకాయిట్ చిత్రంతో రుజువైంది. అడివి శేష్‌తో కలిసి నటనకు స్కోప్ ఉన్న పాత్రతో ఆమె మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించేలా చేసింది.

Mrunal Thakur entry into Tamil Film Industry

అయితే అటు ప్రొఫెషనల్‌గా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్న మృణాల్ థాకూర్ తాజాగా అఫైర్ వార్తల్లో చిక్కుకొన్నది. సౌత్ స్టార్ హీరో ధనుష్‌తో ప్రేమలో ఉందనే వార్త కొద్దికాలంగా మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. అయితే ఈ వార్త గురించి అటు ధనుష్ గానీ, ఇటు మృణాల్ గానీ ఖండించకపోవడంతో అనేక రకాల సందేహాలు పెరిగిపోయాయి. త్వరలోనే పెళ్లి అంటూ ఓ వార్త కూడా బాంబులా పేలింది. అయితే ఈ గాసిప్ వార్త కొనసాగుతుండగానే మరో రూమర్ తెరపైకి వచ్చింది.

ధనుష్‌తో డేటింగ్, అఫైర్ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఆయనతో కలిసి తమిళ ఇండస్ట్రీలో అడుగపెట్టేందుకు మృణాల్ సిద్దమవుతున్నది. కోలీవుడ్ ఎంట్రీని భారీగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తున్నది. ధనుష్ తన సొంత బ్యానర్‌లో నిర్మించడమే కాకుండా దర్శకత్వం వహించే సినిమాలో మృణాల్ నటించబోతున్నారనే వార్త వైరల్ అవుతున్నది.

ధనుష్ దర్శకత్వం వహించే ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతున్నది. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల హృదయాలను దోచుకొనే బలమైన పాత్రతో తమిళ ఇండస్ట్రీలో మృణాల్ ఎంట్రీ ఇవ్వబోతున్నది. ఇప్పటికే ఈ సినిమా కోసం మృణాల్ రోల్ గురించిన టెస్ట్ షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ గురించి వివరాలు వెల్లడించడమే కాకుండా సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ధనుష్ పావులు కదుపుతున్నాడనే వార్త కోలీవుడ్‌లో వైరల్ అవుతున్నది. అయితే ఈ వార్తలో ఎంత నిజమున్నది అనే విషయం మృణాల్ గానీ, ధనుష్ గానీ హింట్ ఇస్తే ఫ్యాన్స్‌ ఇక చెలరేగిపోవడం ఖాయం అంటున్నారు.

Read more about: mrunal thakur dhanush kollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X