Mrunal Thakur: స్టార్ హీరోతో మృణాల్ థాకూర్ పెళ్లి.. ఫిబ్రవరి 14న సీక్రెట్‌గా అంటూ..!

సినిమా పరిశ్రమలో తారల మధ్య రిలేషన్‌షిప్ వార్త పుట్టడం సహాజంగానే జరుగుతుంటాయి. ఏ హీరో, హీరోయిన్ అయినా కలిసి రెండు, మూడు సినిమాల్లో నటిస్తే చాలూ వారి మధ్య డేటింగ్, అఫైర్ సంబంధాలు మీడియాలో వెలుగు చూస్తాయి. అయితే తాజాగా ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా చెలామణి అవుతున్న ఇద్దరు తారలు డేటింగ్ చేస్తున్నట్టు రూమర్లు గత కొద్దికాలంగా మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వారి రిలేషన్‌షిప్ ఇప్పుడు పెళ్లి వరకు వచ్చిందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఇద్దరు తారలు ఎవరు? వారి డేటింగ్, పెళ్లికి సంబంధించిన గాసిప్ ఏమిటంటే?

తెలుగులో సీతారామం సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిన మృణాల్ థాకూర్ గత కొద్దికాలంగా డేటింగ్ వార్తల్లో మీడియాలో హైలెట్ అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ సీనియర్ తెలుగు హీరోతో అఫైర్ వార్త రావడం.. వాటిలో పెద్దగా విషయం లేకపోవడంతో అది రూమర్‌గానే మిగిలిపోయింది. అయితే తాజాగా ఏకంగా తమిళ స్టార్ హీరో ధనుష్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వార్త కొన్ని నెలలుగా మీడియాలో హెడ్‌లైన్‌గా మారింది. అయితే ధనుష్ హాజరైన బాలీవుడ్ పార్టీలో మృణాల్ కనిపించడంతో ఈ రూమర్‌కు మరింత బలం చేకూరింది. కానీ ఈ వార్తపై మృణాల్ గానీ, అటు ధనుష్ గానీ పెద్దగా స్పందించకపోవడంతో అంతగా ప్రాధాన్యం కలుగలేదు.

Mrunal Thakur Getting Marriage with Dhanush

అయితే తాజాగా వారి డేటింగ్ వ్యవహారం మరో అడుగు ముందుకు వేసి పెళ్లి వరకు వెళ్లింది అని సోషల్ మీడియాలో ఓ పోస్టు సెన్సేషన్‌గా మారింది. సినీ వర్గాల్లో కథనాల ప్రకారం.. మృణాల్ థాకూర్, ధనుష్ ఇద్దరు వ్యక్తిగతం రిలేషన్‌షిప్‌లో కొనసాగుతున్నారు. అయిేత వారిద్దరూ ఫిబ్రవరి 14వ తేదీన పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. వారి వివాహం అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సీక్రెట్‌గా చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. వారి పెళ్లికి మీడియాను దూరంగా ఉంచి తమ ప్రైవసీకి భంగం కలుగకుండా చూసుకోవాలని ప్లాన్ చేసుకొన్నారు అని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది.

అయితే ధనుష్‌తో అఫైర్ గురించి గానీ, పెళ్లి గురించి గానీ మృణాల్ ఎక్కడా ధృవీకరించలేదు. దాంతో ఈ వార్తలో నిజమెంత? రూమర్ ఎంత? అనేది సందిగ్దంగా మారింది. అయితే ఈ రూమర్లపై వారి పీఆర్ వర్గాలు ఖండించినా.. లేదా వివరణ ఇస్తే ఇలాంటి వార్తలకు తెరపడుతుంది. లేకపోతే ఇలాంటి వార్తలు మరింతగా వైరల్ అయ్యే అవకాశం ఉంది అని సినీ, మీడియా వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

గత కొద్దికాలంగా మృణాల్ థాకూర్ తెలుగు సినిమాకు దూరంగా ఉంటున్నారు. బాలీవుడ్‌లోనే ఎక్కువగా ఫోకస్ చేస్తుండటం గమనార్హం. అయితే ఇటీవల ఇలాంటి డేటింగ్ వార్తలు మృణాల్ చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నాయి. ఆమె ఓ క్రికెటర్‌తో చనువుగా ఉంటున్నారనే వార్తలు కూడా ఇటీవల మీడియాలో కనిపించాయి. ఇలాంటి వార్తలతో మృణాల్ నిత్యం మీడియాలో ఏదో ఓక రకంగా ట్రెండింగ్‌లో ఉంటున్నారు.

ధనుష్ విషయానికి వస్తే.. తన భార్యతో విడాకుల తర్వాత తాను సింగిల్‌గానే ఉంటున్నారు. దాంతో ఈ వార్తకు ఆయన పేరు జోడించడంతో ఎక్కువగా ప్రాధాన్యం సంతరించుకొన్నది. కెరీర్ పరంగా చూస్తే.. 2025 సంవత్సరంలో కుబేరా లాంటి హిట్‌ను ఖాతాలో వేసుకొన్నారు. ఆ తర్వాత ఇడ్లీ కడై, బాలీవుడ్ చిత్రం తెరే ఇష్క్ మే సినిమాలో నటించారు. ప్రస్తుతం కారా అనే చిత్ర షూటింగుతో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Read more about: mrunal thakur dhanush kollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X