టాలీవుడ్‌కు దూరంగా మృణాల్ ఠాకూర్.. ఆ ఇండస్ట్రీపై సీత మోజు!
ఏ హీరోయిన్ కి అయినా సినిమాల్లోకి వెళ్లిన వెంటనే మంచి హిట్ వచ్చి అందరి మన్ననలు కోరుకోకుండా ఉంటారా చెప్పండి? మరి అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకి ఇటీవల ఏ హీరోయిన్ కూడా అవ్వనంత దగ్గరైపోయింది. ఎలాంటి ఎక్స్ పోజింగ్, స్కిన్ షో కూడా లేకుండా కేవలం తన పెర్ఫామెన్స్ తోనే ఎంతగానో మెస్మరైజ్ చేసిన ఆ హీరోయిన్ నే మృణాల్ ఠాకూర్.
అవ్వడానికి హిందీ ఆర్టిస్ట్ అయినా తెలుగులో చేసిన ఆమె మొదటి సినిమానే పెద్ద హిట్టయ్యింది. "సీతా రామం" అంటూ వచ్చిన ఈ సినిమాతో పర్మనెంట్ గా సీత అనే పాత్రలో ఆమె మిగిలిపోయింది. అక్కడ నుంచి నెక్స్ట్ నాచురల్ స్టార్ నానితో చేసిన "హాయ్ నాన్న" కూడా భారీ హిట్ అవ్వడమే కాకుండా ఆమెకి కూడా మరింత పేరు తీసుకొచ్చింది.

దీనితో హ్యాట్రిక్ కొట్టాలని చేసిన మూడో సినిమానే "ది ఫ్యామిలీ స్టార్". యువ హీరో విజయ్ దేవరకొండ తో చేసిన ఈ సినిమా టాలీవుడ్ లో దారుణమైన ఫెయిల్యూర్. అంతే కాకుండా విజయ్ ప్లాప్ అనడం కన్నా మృణాల్ కి ప్లాప్ వచ్చింది అని మాట్లాడుకున్నారు. దీనితో మృణాల్ హిట్ స్ట్రీక్ కి బ్రేక్ పడింది.
దీని తర్వాత మరో సినిమాలో మృణాల్ చేస్తున్నట్టుగా కనిపించలేదు కానీ సైలెంట్ గా భారీ పాన్ ఇండియా చిత్రం "కల్కి 2898 ఎడి" లో కూడా నటించేసింది. కానీ సినిమాకి మంచి పేరు వచ్చింది కానీ ఈమె కోసం కానీ తన పాత్రకి సినిమా సినిమాలో పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. దీంతో వరుసగా రెండు డిజప్పాయింట్మెంట్ లు మృణాల్ కి టాలీవుడ్ లో ఎదురయ్యాయి.

దీనితో మళ్ళీ ఆమె బాలీవుడ్ లోకి వెళ్ళిపోతుంది అని వినిపిస్తుంది. ఆల్రెడీ ఓ సినిమాని కూడా ఆమె ఓకే చేయడంతో టాలీవుడ్ కి ప్రస్తుతానికి హ్యాండ్ ఇచ్చినట్టే అని కొందరు అంటున్నారు. కాగా మృణాల్ ఠాకూర్ ఇప్పుడు బాలీవుడ్ లో సన్నాఫ్ సర్దార్ 2 అనే సినిమాకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా మృణాల్ హీరోయిన్ సోనాక్షి సిన్హాని రీప్లేస్ చేస్తుంది అని టాక్. అలాగే ఈ సినిమా మన టాలీవుడ్ హిట్ జక్కన్న రాజమౌళి, సునీల్ కాంబినేషన్ లో వచ్చిన "మర్యాద రామన్న" కి రీమేక్ గా తెరకెక్కించగా హిందీలో భారీ హిట్ అయ్యింది. మరి ఇప్పుడు దీనికి సీక్వెల్ ని తీసుకొస్తున్నారు. మొత్తానికి అయితే మృణాల్ ప్రస్తుతానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనే టాక్ నడుస్తుంది. మరి రానున్న రోజుల్లో మృణాల్ ఏమన్నా కొత్త సినిమాలు తెలుగులో అనౌన్స్ చేసి టాలీవుడ్ కి దూరం అవ్వలేదు అని సమాధానం ఇస్తుందేమో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











