Mrunal Thakur: మృణాల్ రెమ్యునరేషన్ డిమాండ్ భారీగా.. మెగా హీరోతో మూవీ చేజారిందా?
టాలీవుడ్ సినిమాలో కేవలం ఒక్క సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ముద్దగుమ్మలు కొందరు ఉన్నారు. కాగా ఈ మధ్య కాలంలో అయితే సౌత్ లో ఇలా చాలా మందే వచ్చారని చెప్పాలి. మరి వీరిలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఒకామె అని చెప్పాలి. మరి మృణాల్ ఠాకూర్ అవ్వడానికి హిందీ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో మాత్రం భారీ క్రేజ్ ని ఒక్క సినిమాతోనే అందుకుంది.
యువ హీరో దుల్కర్ సల్మాన్ తో నటించిన సీతా రామం చిత్రంతో ఆమె తెలుగు తెరకి పరిచయం అయ్యి అక్కడ నుంచి అందరితో సీతగా పిలిపించుకుంది. మరి ఇక్కడ నుంచి వరుస ఆఫర్స్ తెలుగులో మృణాల్ కి వరించాయి. నెక్స్ట్ నానితో చేసిన సినిమా హాయ్ నాన్న సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె నటించిన ది ఫ్యామిలీ స్టార్ మాత్రం డిజాస్టర్ అయ్యింది.

ఇక ఈ సినిమా తర్వాత చాలా నెలలు తరబడి మృణాల్ తెలుగు సినిమాకి దూరం అయ్యిపోయింది. ఒక టైం లో అయితే అసలు తెలుగు సినిమాలకి దూరంగా మళ్ళీ హిందీ సినిమాలోకే వెళ్ళిపోతుందని టాక్ వచ్చింది. కానీ మళ్ళీ ఎట్టకేలకి యువ హీరో అడివి శేష్ తన డెకాయిట్ సినిమా కోసం ఆమెని తీసుకొచ్చాడు. కాగా మళ్ళీ తెలుగు సినెమలి తెలుగు వ్యక్తులతో బిజీగా మారిన మృణాల్ ఇప్పుడుకి మాత్రం ఈ ఒక్క సినిమా మాత్రమే చేస్తుంది.
కాగా ఈ సినిమా కాకుండా మరో తెలుగు సినిమా ఉందా లేదా అనేది సస్పెన్స్ గా మారితే తనపై ఓ కొత్త రూమర్ ఇపుడు బయటకి వచ్చింది. టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లో మెగాస్టార్ చిరంజీవి అలానే స్టార్ దర్శకుడు అనీల్ రావిపూడి కలయికలో ఓ సినిమా ఇపుడు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా అంటూ చాలా మంది బ్యూటీస్ పేర్లే ఇపుడు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
మరి ఇలా మెగాస్టార్ సరసన మేకర్స్ మృణాల్ కూడా బాగుటుంది అని భావించారట. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని మరో వెర్షన్ కూడా వినిపిస్తుంది. ఆమె పేరును అనుకున్నారు కానీ మృణాల్ మాత్రం ఈ కాంబినేషన్ కోసం భారీ రేటు చెప్పినట్టుగా తెలుస్తుంది. అందుకే ఆమెని మేకర్స్ వద్దనుకున్నట్టుగా మరో టాక్. కాగా మృణాల్ ఇపుడు తెలుగులో పెద్దగా ఫామ్ లో లేకపోయినప్పటికీ చిరు, అనీల్ కాంబినేషన్ కనుక ఆమె ఎక్కువ చెప్పిందట.
దీనితో ఇపుడు ఆమెకి బదులు మరో బ్యూటీని మేకర్స్ వెతికే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ చాలా మంది హీరోయిన్స్ పేర్లు, గతంలో చిరు సరసన నటించినవారు, ఇపుడు ఉన్న హీరోయిన్స్ లో చిరంజీవి పక్కన ఎవరు సెట్ అయ్యేలా అనిపించినా కూడా వారిని ఈ సినిమాలో హీరోయిన్ గా మేకర్స్ పరిశీలిస్తున్నారట. మరి చూడాలి మెగాస్టార్ సరసన ఏ బ్యూటీ కనిపిస్తుంది అనేది.


Click it and Unblock the Notifications









