MS Dhoni: మెగా హీరో మూవీలో MS ధోని!

ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న పలు అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలు ఉంటే వాటిలో దాదాపు ఎక్కువ శాతం మన తెలుగు సినిమా నుంచి ఉండేవే ఉంటాయని చెప్పడంలో డౌట్ లేదు. ఇలా ఉన్న తెలుగు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ చేస్తున్న తదుపరి సినిమా కూడా ఒకటి. కాగా దర్శకుడు శంకర్ తో చేసిన గేమ్ ఛేంజర్ సినిమా ఎంతో కాలం ఆలస్యం అవుతూ వచ్చి ఫైనల్ గా డిజాస్టర్ ఫలితాన్నే మిగుల్చుకుంది.

కాగా ఈ సినిమా తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేస్తున్న సినిమా పట్లే ఇపుడు మంచి హైప్ నెలకొంది. కాగా రామ్ చరణ్ కెరీర్లో ఇది 16వ సినిమా కాగా ఈ చిత్రం కోసం స్టార్ నటులు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, కన్నడ నుంచి శివ రాజ్ కుమార్ అంతెందుకు ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ లాంటి వారినే ఎగ్జైట్ చేసి తన సినిమాకి వర్క్ చేసేలా చేసుకున్నాడు బుచ్చిబాబు.

is ms dhoni in global star ram charan next here is truth

ఇలా తన పరంగా మాత్రం భారీ హైప్ ఈ సినిమాకి బిల్డప్ అయ్యింది. కాగా ఇన్ని సెటప్ చేసిన బుచ్చిబాబు మరో మైండ్ బ్లాకింగ్ ప్లాన్ ని గ్లోబల్ స్టార్ సినిమా కోసం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాగా లేటెస్ట్ రూమర్స్ ప్రకారం ఇండియన్ క్రికెట్ కి చెందిన ఒక బిగ్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో కనిపించే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ క్రికెటర్ ఎవరో కూడా కాదు ఇపుడు ఐపీఎల్ వస్తుందిగా..

ఐపీఎల్ లో ఏ స్టేడియం లోకి వెళ్లినా ఆ హోమ్ గ్రౌండ్ టీంని కూడా డామినేట్ చేసే జెర్సీ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోని అట. ఇది వినేందుకే ఓ రేంజ్ లో ఎగ్జైట్మెంట్ ని తీసుకురావచ్చు కానీ ధోని లాంటి బిగ్ స్టార్ ని సినిమాలోకి లాగడం అనేది పెద్ద అంశమే అని చెప్పాలి. ధోని పలు యాడ్స్ చేశారు కానీ సినిమాల్లో నటించింది లేదు. అలాగే నిర్మాణ సంస్థ ఉంది.

is ms dhoni in global star ram charan next here is truth

తనపై బయోపిక్ కూడా వచ్చింది కానీ సినిమాల్లో మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు. కాగా క్రికెట్ నుంచి సినిమా లోకి వచ్చిన క్రికెటర్స్ చాలా మంది ఉంది ఉన్నారు. సో ధోని కూడా ఎంట్రీ ఇస్తారని ఇపుడు మొదలైన రూమర్స్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది చూడాలి. కాగా ధోని, రామ్ చరణ్ ఇది వరకు ఓ యాడ్ కోసం స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది.

పైగా ఈ సినిమా కూడా క్రికెట్ నేపథ్యంలోనే అంటున్నారు.. సో ఛాన్స్ అయితే లేకపోలేదు. మరి ఈ భారీ సినిమా కోసం ఎంఎస్ ధోని వస్తున్నారో లేక ఇదంతా గాలి బజ్ మాత్రమేనా అనేది వేచి చూడాల్సిందే. అన్నట్టు ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన నటిస్తుండగా వచ్చే ఏడాదికి సినిమాని ప్లాన్ చేస్తున్నారట.

More from Filmibeat

Read more about: ms dhoni ram charan bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X