MS Dhoni సినీరంగంలోకి ఎంట్రీ.. టాలీవుడ్‌లో నిర్మాతగా ధోని.. బ్యానర్ పేరు ఏమిటంటే?
క్రికెట్ మైదానంలో ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన మహేంద్ర సింగ్ ధోని సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారనే వార్త దక్షిణాది మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. దక్షిణాదిలో విశేషమైన అభిమానులు ఉన్న ధోనికి ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో బలమైన అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ధోని సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టి.. తెలుగు, మలయాళం, తమిళ చిత్రాలను నిర్మించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఈ వివరాల్లోకి వెళితే...

ఐపీఎల్‌తో దక్షిణాదికి చేరువగా
దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకొనే ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోని ఆడటం ద్వారా తమిళ, దక్షిణాది అభిమానులకు మరింత చేరువయ్యాడు. రాంచీ డైనమెట్ ధోని గత దశాబ్దకాలానికిపైగా CSKతో కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ పలుమార్లు ట్రోఫీలను సాధించిపెట్టాడు. 2023లో జరిగే ఐపీఎల్ టోర్నీకి రెడీ అవుతున్నాడు.

టీ20 వరల్డ్ కప్ పోటీలకు
ప్రస్తుతం ఎంఎస్ ధోని ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ పోటీలకు సిద్దమవుతున్నాడు. ఈ వరల్డ్ కప్ పోటీ కోసం షూట్ చేస్తున్న యాడ్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ యాడ్స్ షూటింగ్ కోసం ఇటీవల చెన్నైలో చేరుకొన్నాడు. వరల్డ్ కప్ ప్రమోషనల్, ఇతర బ్రాండ్స్ షూటింగ్‌లో ధోనితోపాటు యువరాజ్ సింగ్ కూడా పాల్గొనున్నాడు. ఇటీవల ఓ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం సచిన్‌తో జతకట్టాడు. వారిద్దరూ టెన్నిస్ ఆడుతుండగా షూట్ చేసిన వీడియో, ఫోటోలు వైరల్ అయ్యాయి.

చెన్నైలో ఒక ఈవెంట్‌లో
చెన్నైలో ఒక ఈవెంట్‌లో పాల్గొన్న మహేంద్ర సింగ్ ధోని అభిమానుల్లో ఉత్సాహపరిస్తూ స్పీచ్ ఇచ్చారు. త్వరలోనే ఐపీఎల్ కోసం చెన్నై వస్తున్నాను. అలాగే మీకు ఓ శుభవార్తను కూడా అందిస్తాను అనే విధంగా మాట్లాడారు. అయితే ధోని మాటలపై స్పందిస్తూ.. త్వరలోనే ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి ధోని అడుగుపెడుతున్నారనే కథనాలు వస్తున్నాయి.

సినీ నిర్మాణంలోకి ధోని
మహేంద్ర సింగ్ ధోని చెన్నైలో బిజీగా ఉన్న సమయంలో తను సినీ నిర్మాణంలోకి ప్రవేశిస్తున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇప్పపటికే వ్యాపార ప్రకటనల రంగంలో బిజీగా ఉన్న వినోద పరిశ్రమలోకి అడుగుపెతున్నారు. తెలుగు, మలయాళం, తమిళ సినిమాలను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు అనే మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై
ధోని దక్షిణాది సినిమా రంగంలోకి ప్రవేశిస్తున్నారనే వార్త రావడంతో అభిమానులు జోష్ పెరిగింది. ఇదిలా ఉండగా, ధోని ఎంటర్‌టైన్‌మెంట్ అనే బ్యానర్‌పై సినిమాలు నిర్మించే ఆలోచనల్లో ఉన్నారు. ఈ మేరకు కొంతమంది ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారు. పక్కాగా ప్లాన్ డిజైన్ తర్వాత అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది అనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ధోని గానీ, ధోనీ పీఆర్ వర్గాలు కానీ స్పందించకపోవడం ఈ వార్త నిజమా? గాసిపా అనే విషయం సందిగ్ధంగా మారింది.


Click it and Unblock the Notifications











