Prabhas, హృతిక్ మల్టీస్టారర్? పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో మైత్రీ నవీన్.. ఎన్ని కోట్ల బడ్జెట్ ఎంతంటే?

దేశ సినిమా చరిత్రలో రికార్డు వసూళ్లను సాధిస్తున్న దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్‌ను, నిర్మాత నవీన్ ఎర్నేనీ కలవడం జాతీయ మీడియాను ఆకర్షించింది. దక్షిణాదిలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో సంచలన విజయాలను అందుకొన్న నవీన్ యెర్నేనీ.. పఠాన్ చిత్రం బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తున్న దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్‌ కలుసుకోవడం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే గత కొద్దికాలంగా మైత్రీ మూవీ మేకర్స్‌ బాలీవుడ్ సినిమా నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నదనే వార్తలకు నవీన్, సిద్దార్థ్ ఆనంద్ కలయిక మరింత బలం చేకూర్చింది. వీరిద్దరి కలయికకు కారణమైన ఓ వార్త ప్రస్తుతం జాతీయ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..

పఠాన్ చిత్రంతో షారుక్ ఖాన్‌కు కెరీర్‌లోనే భారీ హిట్‌ను దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ అందించడం తెలిసిందే. జనవరి 25వ తేదీన రిలీజైన పఠాన్ చిత్రం ఇప్పటికే 650 కోట్లు వసూలు చేసింది. ఇక నవీన్ యెర్నేని నిర్మాతగా మైత్రీ మూవీస్ నిర్మించిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు భారీ విజయాన్ని అందుకొన్నాయి. వీరసింహారెడ్డి 120 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడితే.. వాల్తేరు వీరయ్య చిత్రం 250 కోట్లకు చేరువైంది.

Is Mythri Movie Makers Naveen Yerneni joins hands with Pathaans Siddarth Anand for Prabhas, Hrithik Roshans Pan India movie?

ఇలాంటి భారీ, చరిత్రను లిఖిస్తున్న చిత్రాలతో దూసుకెళ్తున్న సిద్దార్థ్, యెర్నేని నవీన్ బాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాకు ప్లాన్ చేశారు. గత కొద్దికాలంగా చర్చలు కొనసాగుతున్నాయి. పఠాన్ చిత్రం విడుదల తర్వాత వారిద్దరి మధ్య చర్చలు మరింత ముందుకు వెళ్లాయి. ఈ క్రమంలోనే త్వరలోనే ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లకుపైగానే అంటూ వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి

అయితే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేనీ, రవి శంకర్ నిర్మించే చిత్రంలో ప్రభాస్, హృతిక్ రోషన్ నటిస్తున్నారు అనే వార్త మీడియాలో వైరల్ అవుతున్నది. ప్రభాస్, హృతిక్ కాంబినేషన్‌లో రూపొందే సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించడానికి మైత్రీ మూవీ ప్లాన్ చేస్తున్నది. మైత్రీ, సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా కోసం ప్రభాస్ 100 కోట్ల రెమ్యునరేషన్, హృతిక్ రోషన్ 75 కోట్ల పారితోషికం అందుకొంటున్నారు అంటూ దుబాయ్‌కి చెందిన సినీ క్రిటిక్ ఉమేర్ సంధూ ట్వీట్ చేయడం మరింత ఆసక్తిని రేపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X