For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డిప్రెషన్​​లో నాగ చైతన్య?.. ఆ సినిమాతో బిగ్​ షాక్, సినీ కెరీర్​పై అయోమయం!

  |

  టాలీవుడ్​ గుడ్​ బాయ్​గా పేరు తెచ్చుకున్నాడు అక్కినేని నాగ చైతన్య. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున తర్వాత నట వారసుడిగా తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాడు. సినీ ఇండస్ట్రీలో సాధ్యమైనంత వరకు కాంట్రవర్సీ వంటి విషయాలకు దూరంగా ఉంటాడు. సినిమాలు, ప్రమోషన్లు, కెరీర్​ అంటూ తన పని తాను చూసుకుంటుపోయే కామ్​ పర్సన్. అయితే స్టార్​ హీరోయిన్​ సమంతతో నాగ చైతన్యకు విడాకులు అయినప్పటి నుంచి వారి వ్యక్తిగత విషయాలపై అందరూ ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. సినీ కెరీర్​ గురించి తప్పా పర్సనల్​ లైఫ్​ గురించి ఆసక్తి చూపే వాళ్లను కూడా పట్టించుకోడు. ఇటీవల లాల్​ సింగ్​ చడ్డా సినిమాతో బాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ప్రస్తుతం షాక్​లో ఉన్నట్లు సమాచారం.

   అంచనాలు తారుమారు..

  అంచనాలు తారుమారు..


  టాలీవుడ్​ మన్మథుడు నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీకి నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు కావొస్తుంది. నాగచైతన్య 2009లో జోష్ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అక్కినేని కుటుంబం నుంచి హీరో వస్తుండటంతో సినీ అభిమానుల్లో, అక్కినేని ఫ్యాన్స్‌ నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా విడుదలైన తర్వాత అంచనాలన్నీ తారుమారయ్యాయి.

   ముద్దు సీన్లతో..

  ముద్దు సీన్లతో..

  తర్వాత గౌతమ్​ వాసుదేవ్​ మీనన్​ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో మంచి హిట్​ కొట్టాడు నాగ చైతన్య. ఇందులో ముద్దు సీన్లు, నటనతో యూత్​ను ఎక్కువగా అట్రాక్ట్ చేశాడు. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్​ఫేర్​ అవార్డు కూడా అందుకున్నాడు.

  లవర్​ బాయ్​గా ముద్ర..

  లవర్​ బాయ్​గా ముద్ర..

  అనంతరం క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ దర్శకత్వంలో మిల్క్​ బ్యూటీ తమన్నాతో నాగ చైతన్య జోడి కట్టిన చిత్రం 100% లవ్. ఈ సినిమా కూడా బ్లాక్​ బస్టర్ హిట్​ అయింది. దీంతో చైతూ లవర్ బాయ్​గా ముద్ర వేసుకున్నాడు. ఇక ఈ భారీ విజయాల తర్వాత వచ్చిన దడ, బెజవాడ, అటో నగర్​ సూర్య, తడఖా సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.

  నాగ చైతన్య, సమంత కెమిస్ట్రీ..

  నాగ చైతన్య, సమంత కెమిస్ట్రీ..

  అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం మనం. విక్రమ్​ కె కుమార్​ దర్శకత్వం వహించిన ఈ మూవీ టాలీవుడ్​ ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని ఇచ్చింది. ఇందులో సమంత నటించడం, నాగ చైతన్య, సామ్​ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండటమే కాకుండా అమల, అఖిల్​ అతిథి పాత్రల్లో మెరవడంతో పూర్తిగా అక్కినేని ఫ్యామిలీ సినిమా అయింది.

  నిరాశపరిచిన థ్యాంక్యూ..

  నిరాశపరిచిన థ్యాంక్యూ..


  మనం సినిమా హిట్​ తర్వాత చాలా ఏళ్లు నాగ చైతన్యకు మంచి హిట్​ పడలేదు. 2020లో వచ్చిన లవ్​ స్టోరీ, బంగార్రాజు సినిమాలు చైతూని మళ్లీ నిలబెట్టాయి. ఇక మనం వంటి హిట్​ ఇచ్చిన విక్రమ్ కె కుమార్​ దర్శకత్వంలో వచ్చిన థ్యాంక్యూ మూవీ సినీ ప్రియులను నిరాశపరిచింది.

   చడ్డా చడ్డీ బడ్డీగా..

  చడ్డా చడ్డీ బడ్డీగా..


  ఇలా తన సినీ కెరీర్​లో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన నాగ చైతన్య ఇటీవల బాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్​ మిస్టర్​ పర్​ఫెక్ట్​ అమీర్​ ఖాన్​ ప్రధాన పాత్రలో నటించిన సినిమా లాల్​ సింగ్​ చడ్డా. ఈ మూవీలో చడ్డా చడ్డీ బడ్డీ బాలరాజు పాత్రలో నాగ చైతన్య నటించాడు.

   డిప్రెషన్​లోకి నాగ చైతన్య..

  డిప్రెషన్​లోకి నాగ చైతన్య..


  అయితే ఆగస్టు 11న విడుదలైన ఈ మూవీ రిలీజైన తొలి రోజు నుంచే నెగెటివ్​ టాక్​ను మూటగట్టుంది. ఇందులో బాలరాజుగా చైతూ యాక్టింగ్​పై ప్రశంసలు వచ్చినప్పటికీ బాలీవుడ్​ డెబ్యూ అయిన ఈ మూవీ ఫ్లాప్​ కావడం నాగ చైతన్యకు పెద్ద షాక్​ ఇచ్చింది. దీంతో నాగ చైతన్య కొద్దిగా డిప్రెషన్​లోకి వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

   సినీ కెరీర్​ విషయంలో అయోమయం..

  సినీ కెరీర్​ విషయంలో అయోమయం..


  ఇక ఈ సినిమా తర్వాత తన అప్​కమింగ్​ ప్రాజెక్ట్స్​ గురించి ఆలోచనలో పడ్డాడట. తన సినీ కెరీర్​ ఏమై పోతుందో అని అయోమయంలో పడిపోయినట్లు టాక్​ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఏ కొత్త ప్రాజెక్ట్​కు సైన్​ చేయట్లేదని, తర్వాతి సినిమాలను ఆచి తూచి ఎంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  English summary
  Is Tollywood Young Hero Naga Chaitanya Is In State Of Shock With Thank You Movie And Bollywood Debut Laal Singh Chaddha Failure And Thinking About His Career
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X