నాగచైతన్య తొలిసారిగా డ్యూయల్ రోల్‌లో...!
హైదరాబాద్: హీరో నాగచైతన్య త్వరలో డమరకం చిత్రం దర్శకుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నాగచైతన్యను డ్యూయల్ రోల్ లో చూపించనున్నారని తెలుస్తోంది. అందుకు తగిన విధంగానే దర్శకుడు కథ తయారు చేసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అదే నిజమైతే నాగచైతన్య ద్విపాత్రాభినయం చేసిన తొలి సినిమాగా ఈచిత్రం నిలవనుంది.
ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన చాలా విజయవంతమైన సినిమాల్లో హీరో ద్విపాత్రాభినయంలో కనిపించాడు. ఈ నేపథ్యంలో కథకు అనుగుణంగా సెంటిమెంటును ఫాలో అవుతూ దర్శకుడు శ్రీనివాసరెడ్డి స్టోరీ తయారు చేసుకున్నాడని, నాగచైతన్య బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా క్యారెక్టరైజేషన్ ఉంటుందని అంటున్నారు.
ఈ చిత్రాన్ని కామాక్షి ఎంటర్‌ప్రైజెస్‌పై ప్రముఖ నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలో ఈచిత్రానికి సంబంధించిన టైటిల్ ఖరారు కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
ప్రస్తుతం నాగచైతన్య 'వెట్టై' మూవీకి రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలో బిజీగా గడుపుతున్నారు. మరో వైపు చైతూ దేవా కట్ట దర్శకత్వంలో 'ఆటో నగర్ సూర్య' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్. ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో కె. అచ్చిడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంతా కథానాయికగా నటిస్తోంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'ట్రేడ్ యూనియన్ నేపథ్యంలో రాజకీయాలను మిళితం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని తెలిపారు. బ్రహ్మానందం, సాయికుమార్, జయవూపకాష్‌డ్డి, ఎం.ఎస్. నారాయణ, రఘుబాబు, దువ్వాసిమోహన్, అజయ్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసడ్డి, సమ్మెట గాంధీ, అజయ్‌ఘోష్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











