Bigg Boss Telugu 9 హోస్ట్ ఎవరు? నాగార్జునను తప్పిస్తున్నారా? బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభం ఎప్పుడంటే?

తెలుగు టెలివిజన్ రంగంలో మోస్ట్ టాప్ రేటింగ్ షో బిగ్‌బాస్ తెలుగు. బుల్లితెరపై ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకొన్నది. ఈ ఏడాది తొమ్మిదో సీజన్‌కు ఎండెమాల్ షైన్ సంస్థ రంగం సిద్దం చేస్తున్నది. అయితే గత కొద్దికాలంగా ఎన్నడూ లేని విధంగా హోస్ట్‌ను బిగ్‌బాస్ యూనిట్ మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు భారీగా ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ ప్రచారాన్ని కొందరు సెలబ్రిటీలు కూడా ధృవీకరిస్తున్నట్టు సమాచారం. అయితే హోస్ట్ మార్పు జరుగుతుందా? కొత్త హోస్ట్ ఎవరు? బిగ్ బాస్ తెలుగు 9 ఎప్పుడూ ప్రారంభం కాబోతున్నదనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ఆది నుంచి ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇండియాలోనే టాప్ రేటింగ్ షోలో ఒకటిగా నిలిచింది. అయితే బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ షో ద్వారా ప్రేక్షకులను రంజింప చేయడానికి యాజమాన్యం రకరకాలు ప్రయోగాలు చేసింది. కానీ ఫలితం శూన్యంగానే కనిపించింది.

Bigg Boss Telugu 9 host

గతేడాది అంటే బిగ్‌బాస్ తెలుగు 8 సక్సెస్ కాకపోవడానికి కారణం సెలబ్రిటీల ఎంపిక ఒక కారణమైతే.. హోస్ట్ నాగార్జున తన స్థాయిలో యాంకరింగ్ చేయలేదనే వాదన సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించింది. ఆయన ఎక్కువగా డిఫెన్సివ్ మోడ్‌లోనే కనిపించారనేది ప్రధానంగా ఓ విమర్శ వినిపించింది. అయితే నెటిజన్ల నుంచి వస్తున్న స్పందన చూసిన తర్వాత హోస్ట్ నాగార్జునను మార్చాలనే అంశం ప్రధానంగా వినిపిస్తున్నది.

అయితే బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షోను హోస్ట్ చేసేందుకు నందమూరి బాలకృష్ణ పేరు ఎక్కువగా సర్కులేట్ అవుతున్నది. ఇప్పటికే అన్‌స్టాపబుల్ షోతో ఫుల్ మార్కులు కొట్టేయడమే కాకుండా ఇండియాలోనే నంబర్ 1 టాక్ షోగా మారేలా చేశారు. దాంతో బాలయ్యను ఎండెమాల్ షైన్ సంస్థ సంప్రదిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే బాలయ్యకు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయన ఒప్పుకొంటారా? అనే విషయంపై ప్రధానంగా చర్చ జరుగుతున్నది.

అయితే హోస్ట్ మార్పు ప్రచారంపై మాటీవీ, ఎండెమాల్ షైన్ ఇండియా వారు పెదవి విప్పడం లేదు. నాగార్జుననే హోస్ట్‌గా కొనసాగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదని హీరో పీఆర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే హోస్ట్ ఎవరనేది త్వరలోనే తేలిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది.

ఇక బిగ్‌బాస్ తెలుగు 9 విషయానికి వస్తే.. గత ఏడాది ప్రారంభించిన దానికంటే.. ప్రస్తుతం ఓ నెల ముందుగానే అంటే.. జూలైలోనే బిగ్‌బాస్ షో ప్రారంభం అవుతుంది. బహుశా మొదటి వారంలోనే ఈ షో ప్రారంభం అవుతుందనే విషయం తెలుస్తున్నది. అయితే అధికారికంగా ప్రకటనతోనే ఈ ప్రశ్నలకు జవాబు దొరికే అవకాశం ఉంది. అంతవరకు వేచి చూస్తూ ఉంటూ.. ఆప్‌డేట్స్ కోసం తెలుగు ఫిలింబీట్‌ను ఫాలో అవుతూ ఉండండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X