40 కోట్ల రెమ్యునరేషన్‌తో నాగార్జున ఫుల్ డిమాండ్..ఈ ఆఫర్ ఎందుకో తెలుసా?
తెలుగు వినోద పరిశ్రమలో ముఖ్యంగా బుల్లితెరపై రియాలిటీ షోలకు విశేషమైన ఆదరణ తెలుగు ప్రేక్షకుల నుంచి ఉండటం తెలిసింది. ఇటీవల కాలంలో రియాలిటీ షోలలో బిగ్‌బాస్ తెలుగు షో సంపాదించుకొన్న పాపులారిటీ, ఫాలోవర్స్ అత్యధికంగా ఉన్నారనే విషయాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి షోను హోస్ట్‌గా నాగార్జున అక్కినేని మరోస్థాయికి తీసుకెళ్లారు. గత ఏడు సీజన్లుగా నాగ్ తనదైన శైలిలో షోను ప్రేక్షకులు ఆలరించే విధంగా నడిపిస్తున్నాడు. అయితే త్వరలో ప్రారంభం కాబోయే బిగ్‌బాస్ తెలుగు 10 సీజన్ కోసం ఆయన రెడీ అవుతున్నారు. అయితే ఆయన ఈ షోకు హోస్ట్‌గా తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచారనే విషయం మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ షో, మన్మథుడి పారితోషికానికి సంబంధించిన వివరాల్లో వెళితే..
భారతీయ వినోద పరిశ్రమలో మన్మథుడు నాగార్జున అక్కినేని గత 4 దశాబ్దాలుగా టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నాడు. హీరోగా, నిర్మాతగా, విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆలరిస్తూనే ఉన్నాడు. అలాగే బుల్లితెర మీద కూడా అద్బుతంగా రాణిస్తూ అటు సిల్వర్ స్క్రీన్, ఇటు స్మాల్ స్క్రీన్ అనే తేడా లేకుండా దూసుకుపోతున్నాడు. ఆయన హోస్ట్‌గా వ్యవహరించిన మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్‌బాస్ షోలు భారీ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి.

ఇప్పటి వరకు తెలుగులో బిగ్‌బాస్ తెలుగు షో మొత్తం 9 సీజన్లు పూర్తి చేసుకొన్నది. అయితే తొలి సీజన్‌కు ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నానిని మినహాయిస్తే.. మిగితా ఏడు సీజన్లకు నాగార్జుననే సోలోగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటీవలే తొమ్మిదో సీజన్‌ను టాప్ రేటింగ్‌తో ముగించారని గణాంకాలు వెల్లడించాయి. అదే జోష్‌తో నాగార్జున 10 సీజన్ కోసం సిద్దమవుతున్నారు.
అయితే సరికొత్తగా ప్రారంభం కావడానికి ముస్తాబు అవుతున్న బిగ్‌బాస్ తెలుగు 10 సీజన్ కోసం నాగార్జున అక్కినేనిని హోస్ట్‌గా ఫిక్స్ అయ్యారు. ఈ షో కోసం ఆయన తన రెమ్యునరేషన్‌ను భారీగా డిమాండ్ చేశారు. అందుకు ఎండెమాల్ షైన్ ఇండియా కూడా ఒప్పుకొన్నారు. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఆయన వచ్చే సీజన్ కోసం 40 కోట్ల రూపాయలను పారితోషికంగా డిమాండ్ చేశారు అనే వార్త ప్రచారంలో ఉంది.
గతంలో తొమ్మిది సీజన్ల కోసం సుమారుగా 30 కోట్ల రూపాయలు తీసుకొన్నారు. తద్వారా ఆయన ఇప్పటి వరకు ఈ షో ద్వారా 200 కోట్లకుపైగా ఆదాయాన్ని సంపాదించారు. ఇక సినిమా విషయంలో ఆయన 20 కోట్లకుపైగా రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్నది. అయితే బిగ్‌బాస్ షోతో మాత్రం తనకు ఎదురు లేదని ఆయన నిరూపించుకొన్నారని అభిమానులు ఆనందపడిపోతున్నారు.
నాగార్జున అక్కినేని కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల రజనీకాంత్ నటించిన కూలీ చిత్రంలో స్టైలిష్ విలన్‌గా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆయన తన కెరీర్‌లో 100వ చిత్రం కోసం బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలను నాగార్జున స్వయంగా దగ్గరుండి చూసుకొంటున్నారనే వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇదిలా ఉండగా, సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే బిగ్‌బాస్ షో కోసం రెడీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











