ప్యాకేజ్ డీల్ అన్న సంగతే నాకు తెలీలేదు - డ్రగ్స్ స్కామ్ లో నాగార్జున...!?
టాలీవుడ్ ని కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో చిన్నా చితకా నటులే కాదు పెద్ద తలలు కూడా బయటకు వచ్చేలా ఉన్నాయని మీడియా వర్గాలు ఊహిస్తున్నాయి. నేటి పత్రికా కథనాలు చూస్తే అగ్రహీరో అయిన నాగార్జునకి కూడా ఈ వ్యవహారంలో పాత్ర ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. డైరెక్ట్ గా పేరు రాయకపోయినా పేపర్లలో ఇచ్చిన హిట్స్ చూస్తే అవి నాగార్జునని ఉద్దేశించినవేననే సంగతి తెలుస్తోంది. వ్యాపారంలో అగ్ర శ్రేణికి చేరుకున్న ఒక అగ్ర కథానాయకుడు తనకు ఈ మాదకద్రవ్యాల వ్యాపారంతో వచ్చే లాభాలపై ఆసక్తి లేకపోయినా, కొందరు స్టార్ హీరోయిన్లు, బడాసాబ్ ల కోసం అతను దీనిని ఎంకరేజ్ చేస్తున్నట్టు పత్రికా కథనాలు వెలువడ్డాయి.
వ్యాపారంలో రాణిస్తోన్న సినీ సెలబ్రిటీస్ చాలా మందే ఉన్నా కానీ ఆయా హింట్స్ ని బట్టి నాగార్జునకే అవకాశమెక్కువని ఫిలింనగర్ సర్కిల్స్ కూడా డౌట్స్ రైజ్ చేస్తున్నాయి. దీనికి తోడు నాగార్జున తన ట్విట్టర్ లో 'సెలబ్రిటి కావడం వల్ల కొన్ని తలనొప్పులు కూడా ఉంటాయి సెలబ్రిటీ కావాలనుకుంటే అందుకు కొన్నిసార్లు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దానిని తప్పించుకునే అవకాశమే ఉండదు. ఇదంతా ప్యాకేజ్ డీల్ అన్న సంగతే నాకు తెలీలేదు" అంటూ పోస్ట్ చేయడం ఈ అనుమానాలకు మరింత ఫైర్ జోడిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇవి ఊహాగానాలు మాత్రమే.
పెద్ద పేర్లు ఈ కేసుతో లింక్ అయి ఉండడంతో పోలీసులు కూడా అడుగు ముందుకు వేయడానికి జంకుతున్నారని, తవ్వే కొద్దీ ఈ వ్యాపారంతో సినిమా వాళ్లలో నలభై శాతం మందికి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు బయటపడే అవకాశాలున్నాయని అంచనాలున్న దరిమిలా మున్ముందు మనం సంచలనాలు వినబోవడం, చూడబోవడం ఖాయమనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











